ముగిసిన తొలి నామినేషన్ల ఘట్టం


Wed,April 24, 2019 11:48 PM

- ఎంపీటీసీ, జడ్పీటీసీలకు 784 నామినేషన్లు దాఖలు
- 10 జడ్పీటీసీ స్థానాలకు గానూ 103
- 96 ఎంపీటీసీ స్థానాలకు గానూ 681
- తొలి విడుత పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తొలి విడుత నామినేషన్ల పర్వం ముగిసింది. సిద్దిపేట డివిజన్‌లోని 10 మండలాల్లో తొలి విడుతలోనే వచ్చే నెల 6న పోలింగ్ జరుగనున్నది. మొత్తం 10 జడ్పీటీసీ స్థానాలు, 96 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లను ఈ నెల 24 నుంచి ఆయా మండల కేంద్రాల్లో స్వీకరించారు. బుధవారం నామినేషన్లకు స్వీకరణకు గడువు ముగియడంతో జడ్పీటీసీ స్థానాలకు 103, ఎంపీటీసీ స్థానాలకు 681 నామినేషన్లు దాఖలయ్యాయి. వచ్చిన నామినేషన్లను నేడు(గురువారం) పరిశీలిస్తారు. ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉంది. ఉపసంహరణ అనంతరం అభ్యర్థుల తుది జాబితాను వెలువరిస్తారు. ఆయా పార్టీల అభ్యర్థులకు పార్టీ గుర్తులు, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. కాగా, రెండో విడుత ఎన్నికల నామినేషన్లను ఈ నెల 26 నుంచి స్వీకరిస్తారు. 28న నామినేషన్ల స్వీకరణకు తుది గడువు.

మండలాల వారీగా నామినేషన్లు
తొలి విడుత ఎన్నికలు జరిగే 10 జడ్పీటీసీ స్థానాలకు ఆయా మండలాల వారీగా వచ్చిన నామినేషన్లు సిద్దిపేట రూరల్ 13 , సిద్దిపేట అర్బన్ 11 , చిన్నకోడూరు 11 , నంగునూరు 6, నారాయణరావుపేట 11, దౌల్తాబాద్ 7, దుబ్బాక 17, మిరుదొడి 7, రాయపోల్ 5, తొగుట 15 నామినేషన్లు వచ్చాయి. కాగా టీఆర్‌ఎస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థులు వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, తడిసిన ఉమా వెంకట్‌రెడ్డి, కుంభాల లక్ష్మి రాఘవారెడ్డి, కోటగిరి శ్రీహరిగౌడ్, తుపాకుల ప్రవళికలు నామినేషన్లు దాఖలు చేశారు. 96 ఎంపీటీసీ స్థానాలకు ఆయా మండలాల వారిగా సిద్దిపేట రూరల్ 49, సిద్దిపేట అర్బన్ 55, చిన్నకోడూరు 106, నంగునూరు 73, నారాయణరావుపేట36, దౌల్తాబాద్51, దుబ్బాక 109, మిరుదొడ్డి88, రాయపోల్ 45, తొగుట 69 నామినేషన్లు దాఖలయ్యాయి.

సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి
మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కౌంటింగ్ ప్ర క్రియ పూర్తమ్యే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల పరిశీలకులు శరవనన్, కలెక్టర్ కృష్ణభాస్కర్ చెప్పారు. సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం జిల్లాలో మొదటి విడుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. సిద్దిపేట జిల్లాలో మొదటి విడుతగా చిన్నకోడూరు, దౌల్తాబాద్, దుబ్బాక, మిరుదొడ్డి, నంగునూరు, నారాయణరావుపేట, రాయపోల్, సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్, తొగుట మండలాల్లో ఎన్నికలు జ రుగుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు కా వాల్సిన పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. 10 మండలాల్లో 539 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఇందుకోసం ప్రీసైడింగ్ అధికారులు 647, అసిస్టెంట్ ప్రీసైడింగ్ అధికారులు 647, అదనపు ప్రీసైడింగ్ అధికారు లు 1617 మందిని నియమించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డీపీవో సురేశ్‌బాబు, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల లైజనింగ్ అధికారి శ్రవణ్, నోడల్ అధికారి వెంకటయ్య, ఈడీఎం ఆనంద్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...