మల్లన్న చెంత.. బసకు లేదు చింత


Wed,April 24, 2019 11:46 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ: కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు దాతలు ముందుకు వస్తుండడంతో భక్తులకు మరిన్ని వసతులు సమకూరుతున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులతో పాటు దాతలు లక్షలాది రూపాయలు విరాళాలు ఇచ్చి ఔదార్యం చూపిస్తుండంతో భక్తులకు సౌకర్యాలు కలుగుతున్నాయి. స్వామి వారి క్షేత్రంలో భక్తులకు ఎంతో అవసరమైన గదుల నిర్మాణానికి పలువురు దాతలు ముందుకు వచ్చి నిధులు ఇవ్వడంతో కాటేజీలు నిర్మాణానికి నోచుకుంటున్నాయి. మల్లన్న క్షేత్రంలో భక్తుల కోసం కాటేజీ నిర్మించేందుకు హైదరాబాద్ నగరంలోని నాగారం ప్రాంతానికి చెందిన గడ్డం మహేశ్‌యాదవ్ అనే భక్తుడు రూ.25లక్షలు విరాళంగా అందించారు. మహేశ్‌యాదవ్ విరాళం ఇవ్వడంతో పాటు ఆయనే కాంట్రాక్టర్‌ను కేటాయించి ఆలయ నియమ, నిబంధనల మేరకు ఆధునిక వసతులతో రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌ను ఆలయ సెంట్రల్ స్టోర్‌కు కేటాయించడంతో పాటు మొదటి, రెండవ అంతస్తును భక్తులకు ఉపయోగపడే విధంగా నిర్మాణం పూర్తి చేశారు. నిర్మాణ పనులు పూర్తి కావడంతో గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఆలయ సెంట్రల్ స్టోర్‌ను ఏర్పాటు చేసి ఆలయవర్గాలు వినియోగంలోకి తీసుకువచ్చారు.

రానున్న కొద్దిరోజుల్లో భక్తులకు రెండంతస్తుల భవనం అందుబాటులోకి రానుంది. కాగా దాసారం గుట్టపై రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ రూ.2కోట్లతో అత్యాధునిక వసతులతో గెస్టౌజ్ నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి నిధులు కేటాయించి గదుల నిర్మాణాలకు శ్రీకారం చుడుతుండడంతో మల్లన్న భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...