ప్రారంభమైన ఓపెన్ పరీక్షలు


Wed,April 24, 2019 11:46 PM

సిద్దిపేట టౌన్ : జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 7 పరీక్ష కేంద్రాల్లో ఓపెన్ టెన్త్, 6 పరీక్ష కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఓపెన్ టెన్త్‌కు 1224 మందికి 1127 మంది హాజరయ్యారు. 97 మంది గైర్హాజరయ్యారు. ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 961 మందికి 847 మంది హాజరై పరీక్షలు రాయగా, 114 మంది గైర్హాజరయ్యా రు. మొత్తం 211 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. బుధవారం ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. ఓపెన్ టెన్త్ విద్యార్థులు తెలుగు పరీక్ష రాయగా, ఓపెన్ ఇంటర్ విద్యార్థులు తెలుగు, హిందీ, ఉర్దూ పరీక్షలు రాశారు.

పరీక్ష కేంద్రాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్, జిల్లా విద్యాధికారి రవికాంతారావు, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ శ్యాంప్రసాద్‌రెడ్డిలు పరిశీలించారు. అలాగే, చీఫ్ సూపరింటెండెంట్లు, సిట్టింగ్ స్కాడ్స్, ఫ్లయింగ్ స్కాడ్స్‌లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుం డా పరీక్ష కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు విద్యాశాఖ చేపట్టింది.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...