తోలివిడుతకు నేటితో ఆఖరు


Tue,April 23, 2019 11:55 PM

-రెండోరోజు 97 నామినేషన్లు దాఖలు
-జడ్పీటీసీ స్థానాలకు 15, ఎంపీటీసీ స్థానాలకు 82
-అత్యధికంగా నారాయణరావుపేట జడ్పీటీసీ స్థానానికి 4 నామినేషన్లు
-భారీ ర్యాలీలతో వచ్చి నామినేషన్ దాఖలు చేస్తున్న అభ్యర్థులు
-కేంద్రాల వద్ద కొనసాగుతున్న సందడి
-అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైన పార్టీలు
-టీఆర్‌ఎస్ టికెట్ కోసం నాయకుల తీవ్రయత్నాలు
-పార్టీ కోసం పనిచేసే వారికి టికెట్ దక్కుతుందని ఎమ్మెల్యేల హామీ
-నేడు తొలివిడుత నామినేషన్ల దాఖలుకు ముగియనున్న గడువు
సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మండల, జిల్లా ప్రాదేశిక తొలి విడుత నామినేషన్ల స్వీకరణలో భాగంగా రెండో రోజు మంగళవారం 10 మండలాల్లో 97 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో జడ్పీటీసీ స్థానాలకు 15, ఎంపీటీసీ స్థానాలకు 82 నామినేషన్లు వచ్చాయి. ఆయా మండలాల్లోని ఎంపీటీసీ నామినేషన్ల వివరాలు.. సిద్దిపేట అర్బన్ మండలంలో 7, రూరల్ మండలంలో 9, నారాయణరావుపేటలో 6, నంగునూరులో 12, చిన్నకోడూరులో 18, తొగుటలో 2, మిరుదొడ్డిలో 13, దుబ్బాకలో 9, దౌల్తాబాద్‌లో 3, రాయిపోల్‌లో 3 మొత్తం 82 నామినేషన్లు దాఖలయ్యాయి. జడ్పీటీసీ స్థానాలకు మండలాల వారీగా చూస్తే సిద్దిపేట రూరల్ మండలంలో 3, నారాయణరావుపేటలో 4, నంగునూరులో 2, చిన్నకోడూరులో 3, తొగుటలో 1, దుబ్బాకలో 2 మొత్తం 15 నామినేషన్లు వచ్చాయి. పార్టీల వారీగా నామినేషన్లు చూస్తే జడ్పీటీసీ స్థానానికి బీజేపీ నుంచి 3, కాంగ్రెస్ నుంచి 4, టీఆర్‌ఎస్ నుంచి 3, స్వతంత్రులు 4, టీజేఎస్ 1 వేయగా, ఎం పీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి 7, కాంగ్రెస్ 17, టీఆర్‌ఎస్ 29, స్వతంత్రులు 29 నామినేషన్లు వచ్చాయి. ఆయా మండల కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు కలెక్టర్ కృష్ణభాస్కర్ పర్యవేక్షిస్తూ అధికారులను సమన్వయం చేశారు. ఎక్కడా కూడా ఇబ్బందులు కలుగకుండా అన్నిరకాల చర్యలు తీసుకున్నారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కౌంటర్ల వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. నామినేషన్ల స్వీకరణ రెండో రోజు అభ్యర్థులు ర్యాలీలతో వచ్చి తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులుకు అందజేశారు.

నేటితో తొలి విడుత నామినేషన్ల గడువు పూర్తి
తొలి విడుత నామినేషన్ల స్వీకరణకు నేటి సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనున్నది. బుధవారం మంచి రోజు కావడం, నామినేషన్ల చివరి రోజు కావడంతో నామినేషన్లు పెద్ద సంఖ్యలో వేయనున్నారు. ఇందుకు తగ్గట్లుగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. తొలి విడుతలో మొత్తం 96 ఎంపీటీసీ స్థానాలకు, 10 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్న విష యం తెలిసిందే. ఈ నెల 22 నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. నేటి సాయంత్రం 5 గంటలకు గడువు ముగియనున్నది. సమయంలోపు కౌంటర్ల ఉన్న అందరి నామినేషన్లు స్వీకరిస్తారు. మరుసటి రోజు స్క్రూటీని చేపడుతారు. 28 మధ్యా హ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉంది. కాగా, టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక పూర్తయింది.

అభ్యర్థుల జాబితాను పరిశీలించిన
మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి
గజ్వేల్, నమస్తే తెలంగాణ: స్థానిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను మంగళవారం మాజీమంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ అభ్యర్థ్ధి కొత్త ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. ప్రజ్ఞాపూర్‌లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వివిధ మండలాల ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల జాబితాను వేర్వేరుగా పరిశీలించారు. ఒకరికి మించి పోటీలో ఉన్న స్థానాల అభ్యర్థులతో చర్చించారు. పార్టీ, ప్రభుత్వం కోసం పనిచేసే కార్యకర్తలకు పదవులు లేకున్నా పార్టీలో గుర్తింపు ఉంటుందని సూచించారు. అభ్యర్థి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని, గజ్వేల్ టీఆర్‌ఎస్ అన్ని స్థానాలను భారీ మెజార్టీతో గెలుపొందడానికి కృషి చేయాలని సూచించారు. ఆయా మండల సమన్వయ కమిటీ సభ్యులు, మండలాల వారీగా అభ్యర్థుల పట్టికను తయారు చేయగా హరీశ్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి పన్యాల భూపతిరెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం. భూంరెడ్డి, గ్రంథాలయ జిల్లా చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సీనియర్ నాయకులు పొన్నాల రఘుపతిరావు, డాక్టర్ యాదవరెడ్డి, బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డిలతో పాటు మండల అధ్యక్షులు, సమన్వయ కమిటీ సభ్యులు, సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...