పరిశుభ్రత అందరి బాధ్యత


Tue,April 23, 2019 11:46 PM

దుబ్బాక టౌన్: పరిశుభ్రత అందరి బాధ్యతగా భావిస్తేనే పట్టణాలు, గ్రామాల ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించిన కమిషనర్ మురికి కాలువల శుభ్రత పై దృష్టి సారించారు. మురికి కాలువల్లో ఇష్టానురీతిలో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు పడేయటం మూలంగా పారిశుధ్య సమస్యలు తీవ్రమవుతున్నాయన్నారు. అనేక ప్రాంతాల్లో మురికినీరు ప్రవాహానికి అడ్డంకిగా మారి మురికికాలువలో పేరుకుపోతున్నాయన్నారు. ప్లాస్టిక్ కవర్లు వేసే వారిని గుర్తించి వెయ్యి రూపాయల జరిమానాను విధిస్తామని కమిషనర్ హెచ్చరించారు. ఏ ప్రాంతంలో ప్లాస్టిక్ కవర్లు నిలిచి ఉన్నాయో గుర్తించి వారి పై చర్యలు తీసుకుంటామన్నారు. పారిశుధ్య పనుల మెరుగు కోసం మున్సిపాలిటీ పరిధిని రెండు జోన్లుగా విభజించి ఇన్‌ఛార్జ్‌లను నియమించామన్నారు. ఒకటవ జోన్ పరిధిలోని ఎస్సీ కాలనీ, రేపల్లెవాడ, లాల్ బహుదూర్‌శాస్త్రి చౌరస్తా, బైపాస్ రోడ్, దుంపలపల్లి, మల్లాయిపల్లి, చెల్లాపూర్‌లోని వార్డు ప్రజలు పారిశుధ్యంపై ఏమైనా సమస్యలు ఉంటే ఇన్‌చార్జి శేఖర్ (సెల్ నెం.9848524232)కు ఫిర్యాదు చేయాలని అదే విధంగా రెండో జోన్ పరిధిలోని గాంధీరోడ్, సరస్వతీ నగర్, కొత్త రోడ్, పాతరోడ్, గర్ల్స్ హైస్కూల్, చేర్వాపూర్, లచ్చపేట, ధర్మాజీపేట వార్డుల్లోని ప్రజలు ఫిర్యాదులను ఇన్‌ఛార్జి దిలీప్ (సెల్ నెం. 9966295793)కు ఫిర్యాదు చేయాలని కమిషనర్ సూచించారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...