బాలకథ దీపిక పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే హరీశ్‌రావు


Tue,April 23, 2019 11:45 PM

సిద్దిపేట టౌన్ : సాహితీ రంగానికి సిద్దిపేట కొలువైందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉండ్రాల రాజేశం రచించిన బాల కథా సంపుటాలను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కవి ఉండ్రాల రాజేశం మరిన్ని మంచి కథా సంపుటాలను ఆవిష్కరించాలని ఆకాంక్షించారు. అలాగే ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలను కవులకు తెలిపి అభినందనలు చెప్పారు. బాల సాహిత్యంలో సిద్దిపేట కవులు కృషి చేయడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ సభ్యులు కొమురవెల్లి అంజయ్య, కథాశిల్పి అయిత చంద్రయ్య, కవులు ఎన్నవెల్లి రాజమౌళి, వర్కోలు లక్ష్మయ్య, సుధాకర్, మిట్టపల్లి పర్శరాములు, వీరారెడ్డి, శ్రీనివాస్, చిరంజీవి, శ్రీచరణ్ సాయిదాస్, ఉండ్రాల తిరుపతి, శ్రీనివాస్, మురళీకృష్ణలు ఉన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...