27న రాష్ట్రస్థాయి జానపద పాటల పోటీల సెలక్షన్


Tue,April 23, 2019 11:45 PM

సిద్దిపేట టౌన్ : సిద్దిపేట జిల్లా కేంద్రంలో మే రెండో వారంలో యువ సాహితీ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ జానపదాల సవ్వడి జానపద పాటల పోటీలకు ఈ నెల 27న సెలక్షన్స్ జరుపనున్నామని నిర్వాహకుడు వివి కన్న చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అక్షయ గ్రాండ్ బంకెట్ హాల్‌లో సెలక్షన్స్ నిర్వహించనున్నామని తెలిపారు. ఆసక్తి గల జానపద కళాకారులు, పాటలు పాడే గాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 30 సంవత్సరాలోపు గల యువతీ యువకులు, చిన్నారులు పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే వారు ఏదైన ఒక జానపదం పాడాల్సి ఉంటుందని, సెలెక్ట్ అయిన వారు మే నెలలో నిర్వహించే సెమీ, ఫైనల్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. నిర్వాహకులు సూచించిన జానపదాలే పాడాల్సి ఉంటుందని చెప్పారు. సెలెక్షన్స్‌లో పాల్గొనే వారు పాసుపోర్టు సైజు ఫొటోతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలన్నారు. పాటల పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూ.20 వేల నగదు, రెండో బహుమతి రూ.10 వేలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో సమితి నిర్వాహకులు డబ్బీకార్ సురేందర్, భిక్షపతి, మంజుల, పరమేశ్వర్, మహిపాల్, సుధాకర్, కాల్వ వేణు, సహృదయ్ ఉన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...