హరితవనంగా తొగుట పోలీస్ స్టేషన్


Tue,April 23, 2019 11:44 PM

తొగుట: పచ్చని చెట్లతో తొగుట పోలీస్ స్టేషన్ కళకళలాడుతుంది. పోలీస్ స్టేషన్‌లోకి అడుగుపెట్టగానే పచ్చని చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. గత పోలీస్ అధికారుల చొరువతో మొదలైన పచ్చదనం ప్రక్రియ నేటి అధికారుల కృషితో స్టేషన్ అంతటా విస్తరించింది. కొత్తగా రకరకాల మొక్కలను నాటడంతో పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు మొక్కలతో ఆహ్లాదకరంగా మారాయి. స్టేషన్‌లోని ఎస్‌ఐ, సీఐ కార్యాలయాల ముందు నాటిన మొక్కలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన సీఐ ప్రహరీ పక్కన గులాబీ, చామంతి మొక్కలు నాటడంతో పాటు వాటికి రక్షణ వలయాలు ఏర్పాటు చేశారు. ఇటీవల స్టేషన్‌కు బదిలీపై వచ్చిన సీఐ సోమ్‌నారాయణ్‌సింగ్‌తో పాటు ఎస్‌ఐ రంగ కృష్ణ పచ్చదనానికి ఎంతో కృషి చేస్తున్నారు. ప్రస్తుత ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి మొక్కల సస్య రక్షణ కోసం చర్యలు చేపడుతున్నారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది సైతం సస్యరక్షణ చర్యలో భాగస్వాములవుతున్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...