కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.4,26,607


Tue,April 23, 2019 11:44 PM

జగదేవ్‌పూర్ : కొండపోచమ్మ దేవాలయ హండీ ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని బ్యాంకులో జమచేసి ఆలయ అభివృద్ధికి ఉపయోగించనున్నట్లు కొండపోచమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ రాచమల్ల ఉపేందర్‌రెడ్డి, ఆలయ ఈవో శ్రీనివాసశర్మ అన్నారు. మంగళవారం మండలంలోని తీగుల్‌నర్సపూర్ ప్రసిద్ధ కొండపోచమ్మ దేవాలయ హుండీ లెక్కింపును ఆలయ చైర్మన్, ధర్మకర్తల ఆధ్వర్యంలో సిద్దిపేట సంతోషిమాత దేవాలయ కమిటీ సభ్యులు చేపట్టారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ నెల 15రోజులకు గాను అమ్మవారికి రూ.4,26,607 భక్తులు కానుకల రూపంలో హుండీలో వేసినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయం వద్ద కోటి రూపాయలతో మంటపం నిర్మించేందుకు ప్రతిపాదనలు చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకు 30 లక్షల రూపాయలను బ్యాంకులో జమచేసి చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ అనుమతి రాగానే నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ లక్ష్మీనర్సింహారెడ్డి, డైరెక్టర్లు బండారి నర్సింలు, కొండయ్య, పద్మదేశిరెడ్డి,ఆలయ అధికారులు వెంకట్‌రెడ్డి, ఆలయ సిబ్బంది ఏసు, వీఆర్‌ఏ శ్రీను సంజీవులు పాల్గొన్నారు.
27 వరకు ఇంటర్ సప్లిమెంటరీ రీకౌంటింగ్ గడువు
సిద్దిపేట టౌన్ : విద్యార్థులకు తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఇంటర్ సప్ల్లిమెంటరీ రివెరిఫికేషన్, రీకౌంటింగ్ దరఖాస్తులను ఈ నెల 27 వరకు పొడిగించామని జిల్లా ఇంటర్ విద్యాధికారి సుధాకర్ మంగళవారం తెలిపారు. విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 25 వరకు గల గడువు తేదీని 27 వరకు పొడిగించామని చెప్పారు. అభ్యర్థులందరూ గమనించి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్, సప్లిమెంటరీ ఫీజును చెల్లించవచ్చన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...