సిద్దిపేట మెడికల్ కాలేజ్‌లో


Tue,April 23, 2019 11:44 PM

-అమ్రిత్ ఫార్మసీ ఏర్పాటు వేగవంతం
సిద్దిపేట టౌన్ : సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో అమ్రిత్ ఫార్మసీ ఏర్పాటుకు హెచ్‌ఎల్‌ఎల్ ప్రతినిధులు మంగళవారం సందర్శించారు. మాజీ మంత్రి, సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫార్మసీ ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించబడిన హెచ్‌ఎల్‌ఎల్ నిర్వహించే అమ్రిత్ ఫార్మసీలు మన రాష్ట్రంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ శాఖ ద్వారా పలు దవాఖానల్లో ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగానే మొట్టమొదటి సారిగా మన సిద్దిపేటలో ఈ ఫార్మసీ ఏర్పాటు కానుంది. ఈ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. దవాఖానకి వచ్చే వారితో పాటు ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. 45 రోజుల్లో సిద్దిపేట జిల్లా వైద్య కళాశాలలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు హెచ్‌ఎల్‌ఎల్ ప్రతినిధులు మురళీధర్‌రావు, హెచ్‌ఎల్‌ఎల్ కంపెనీ మేనేజర్, దవాఖాన డైరెక్టర్ తమిళ అరసి, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, నాగరాజులు దవాఖానని సందర్శించారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...