సమగ్ర మార్పు దిశగా..


Tue,April 23, 2019 12:10 AM

గజ్వేల్, నమస్తే తెలంగాణ: తాతముత్త్తాతలు చేసిండ్రు ఎవుసం.. నేను చేస్తున్న అదే ఎవుసం..వాళ్లు బతుక లేదా.. పిల్లల్ని సాదలేదా... నేను బతుకనా పిల్లల్ని ఉన్నంతలో సాధలేనా.. అనుకుంటే కొత్తదనం ఏముంటుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో కూడా మార్పులు రావాలి. సాగు పనుల్లో సాంకేతికత చోటు చేసుకోవాలి. పెట్టుబడి, సమయం తగ్గించుకుని నాణ్యమైన అధిక దిగుబడులు పొందడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని సాగు పనులు సాగాలి. ఇంకా నష్టాల వ్యవసాయాన్ని చేస్తూ రైతు కుటుంబాలు కష్టాల పాలు కాకుండా లాభపాటి వ్యవసాయానికి జీవం పోయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. వ్యవసామంలో సమగ్ర మార్పులు రావాలి. వ్యవసాయంలో ఆధునిక యజమాన్య పద్ధతులు ఆచరణలోకి తేవాలి. ఆధునిక యంత్ర పరికరాలు ఉపయోగంలో మనమే ముందు నిలువాలి. మార్కెటింగ్ పరిస్థితులు, పరిసరాలు, భూ వివరాల ఆధారంగా శాస్త్రీయ పద్ధతుల్లో సాగు జరిగితే మంచి దిగుబడులు పొందడంతో రైతు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాడు. అప్పుడే ఆ వృత్తికి, కుటుంబానికి విలువ పెరుగుతున్నది.

ఆహార ధాన్యం, కూరగాయలు, పండ్ల కొరత తీరి స్వయం ప్రతిపత్తిగా రాష్ట్రం మారాలని సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికతో రైతు సమగ్ర సర్వేను పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
సమగ్ర రైతు సర్వేతో ఆధునిక సాగు పద్ధతుల వైపు వ్యవసాయాన్ని మళ్లించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక ప్రారంభించింది. పంట కాలనీల ఏర్పాటే లక్ష్యంగా సమగ్ర వ్యసాయ సమాచార సేకరణ కొనసాగుతున్నది. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి వ్యవసాయ అధికారులు భూమి, వాతావరణ పరిస్థితులు, మార్కెటింగ్, యజమాన్యం, రైతుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రత్యేక ఫార్మట్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. 39 అంశాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తుండగా, దీనితో రైతు సర్వే నెంబర్ చెబుతే ఆ నేల గుణగణాలు, పంటల సాగుకు యోగ్యం, ఏ రకాలు ఎప్పుడు వేయాలి, ఎరువుల మోతాదు తదితర సిఫార్సులు చేయడానికి వీలు కలుగడంతో పాటు పంటల సాగుపై రైతుకు ప్రత్యేక సమాచారం అందుబాటులోకి వస్తున్నది. అలాగే ప్రభుత్వం వద్ద కూడా వ్యవసాయ కమతాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉండటంతో రైతుకు ముందస్తు సూచనలు అందించే వీలు కలుగుతున్నది.

రైతు వారీగా సర్వే
రైతు వారీగా రైతు సమగ్ర సర్వే కొనసాగుతున్నది. రైతు, పొలానికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. నేల స్వభావం, పండించే పంటలు, ఉత్పత్తులకు సంబంధించిన మార్కెటింగ్ సౌకర్య సమాచారంతో పాటు ఆధార్, బ్యాంకు ఫోన్ నెంబర్లు పొందుపరుస్తున్నారు.

ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీలు, రాయితీలు, పోత్సహాకాల వివరాలు కూడా ఉన్నాయి. బీమా, రైతుబంధు, రైతు బీమా, రైతు సంఘాల భాగస్వామ్యం తదితర అంశాలు సెకరిస్తున్నారు. ప్టాబీలో రైతు వివరాలతో పాటు విద్యార్హత, నీటి వసతి రకం, ఆధునిక సాగు పద్ధతుల వినియోగం, మట్టి భూసార పరీక్ష వివరాలు, గతంలో వేసిన పంటల వివరాలు, వచ్చే సీజన్‌లో సాగు చేయాలనుకున్న పంటల వివరాలు, అందుబాటులో ఉన్న వ్యవసాయ పనిముట్లు, సాగు యోగ్యంలో లేని భూమి వివరాలు, రుణాలు, పంటల బీమా, పంట ఉత్పత్తుల మార్కెటింగ్ సౌకర్యం, అందు బాటులో ఉన్న లేదా ఉండాల్సిన (అవసరం ఉన్న) ప్రాసెసింగ్ పరిశ్రమ, రైతు సంఘాల్లో క్రియాశీలత్వం, సేంద్రియ వ్యవసాయంలో రైతుకు అవగాహన, పశు సంపద వివరాలు ప్రత్యేక ఫార్మట్‌లో పొందుపర్చుతున్నారు. వ్యవసాయ, ఉద్యాన వన గ్రామీణ అభివృద్ధి పరిశ్రమల శాఖ సంయుక్తంగా చేపట్టిన ఈ సమగ్ర రైతు సర్వే సాగుకు సత్ఫలితాలిస్తుందని భావిస్తున్నారు.

క్రాప్ కాలనీల దిశగా..
నాణ్యత, అధిక దిగుబడుల సాధన లక్ష్యంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవడం, ఉన్న వనరులు, వసతులను సద్వినియోగం చేసుకుంటూ తగిన యజమాన్య పద్ధతులతో సాగులో సమూల మార్పు లక్ష్యంగా ప్రణాళిక ప్రభుత్వం తయారు చేస్తున్నది. ముఖ్యంగా క్రాప్ కాలనీల ద్వారా అనేక రకాలుగా రైతుకు మేలు జరుగుతున్నది. దిగుబడులు పెరుగడం, మార్కెటింగ్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో రైతుకు పంటల సాగుపై సాంకేతిక సమాచారం అందుబాటులోకి వస్తున్నది. ఒకే రకమైన పంటలు ఒకే ప్రాం తలో ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేయడం వల్ల సాగు, యజమాన్య పద్ధతుల్లో కూడా రైతుకు కలిసివస్తున్నది. సేంద్రియ సాగుకు అవకాశాలు మెరుగు పడుతాయి.

ఆరోగ్య తెలంగాణ నిర్మాణం లక్ష్యం
బంగారు తెలంగాణ నిర్మాణానికి ముందు ఆరోగ్య తెలంగాణను సాధించుకోవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. కలుషితం లేని నాణ్యమైన తాజా ఆహార పదార్థాలు ప్రజలకు అందుబాటులోకి రావాలి. పండ్లు, కూరగాయలు, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ప్రతి కుటుంబం, గ్రామం, ప్రాంతం స్వయం సమృద్ధిగా మారాలి. కూరగాయలు, పండ్లు ఆహార ధాన్యాలు పట్టణ ప్రాంతాల నుంచి గ్రామ ప్రాంతాలకు దిగుమతులు అవుతున్నాయి. నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఉత్పత్తులు సాధిస్తే రైతుకు లాభాలు వస్తాయి. ఆ ప్రాంతం స్వయం సమృద్ధిగా మారుతున్నది. అన్ని గ్రామాలు, ప్రాం తాలు తమకు తాము ఉత్పత్తులు పెంచుకుని అవసరం పూర్తి వినియోగించుకొని మిగతా ప్రాంతాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదుగాలన్నదే లక్ష్యం. ప్రతి రోజు ఆహార పదార్థ్ధాలు నాణ్యమైన తాజావి కుటుంబానికి అందుతాయి. అరోగ్యకరమైన కుటుంబ, సమాజ నిర్మాణానికి అవకాశాలు ఏర్పడుతాయి.

సాగుపై సమగ్ర సమాచారం..
రైతు సమగ్ర సర్వేతో అనేక అంశాలలో ప్రయోజనం ఏర్పడుతున్నది. భూమి గుణ గణాలు స్థానికంగా సాగు యోగ్యమైన పంటలు, రకాల వివరాలు, వాటిపై అంశాలతో తెగుళ్లు, నివారణ చర్యలపై పూర్తి సమాచారం ముందుగానే రైతుకు అందుబాటులో ఉంటుంది. క్రాప్ కాలనీల సాగు అమలు సాగు, యాజమాన్య పద్ధతులు సామూహికంగా అనుసరించే అవకాశాలతో పాటు, మార్కెంటింగ్ సౌకర్యం రైతు వద్దకు వస్తున్నది. ఆధునిక యంత్రాలు అందుబాటులోకి రావడంతో పాటు అవసరమైన శీతల, గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెంసింగ్ యూనిట్లు ఏర్పాటుకు వీలు కలుగుతున్నది. అవసరమైన పంటను పూర్తి అవసరమైన సమయంలో దిగుబడులు వచ్చే విధంగా ప్రణాళిక ఏర్పాటుతో పాటు ఎగుడు దిగుడు ధరల బెడద లేకుండా రైతుకు మద్ధతులతో కూడిన గిట్టు బాటు లాభసాటి ధర అందే వీలు కలుగడం ప్రధాన అంశం.

కాళేశ్వరం నీళ్లు వస్తే ఫలితాలు..
ప్రస్తుతం జిల్లాల వివిధ ప్రాంతల్లో వివిధ పంటలు పండిస్తున్నారు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేసేవారు. ఇప్పుడు వివిధ పంటలు సాగు చేసి సాగునీటి కొరత, తెగుళ్ల బెడదకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ధర లేక నేల పాలు చేస్తున్నారు. సమగ్ర సర్వేవల్ల ప్రాంతాల వారీగా పంటల ప్రణాళిక ఉంటుంది. మార్కెటింగ్ పరంగా అవసరాలపై రైతుకు అవగాహన కల్పించడం జరుగుతున్నది. ముఖ్యంగా కళేశ్వరం నీళ్లు వస్తే అన్ని పంటలకు నీటి కొరత తీరుతున్నది. ఏ పంట ఎంత విస్తీర్ణంలో ఏ సమయంలో సాగు చేయాలన్నది రైతుకు ముందే అవగాహన ఉంటుంది. దీనికి క్రాప్‌కాలనీల ద్వారా రైతుకు ప్రయోజనం ఏర్పడుతున్నది.వరి సాగు పెరుగుతున్నది. అయితే ఏ ప్రాంతంలో వరి పండించాలన్నది ముందస్తు ప్రణాళికను రైతు అనుసరిస్తాడు. మిగతా ప్రాంతల్లో ఏ పంటలు పండించాలన్నది సాముహిక నిర్ణయంతో క్రాప్‌కాలనీల ఏర్పాటు సత్ఫలితాలిస్తాయి.

సర్వేపై ప్రజల్లో మంచి స్పందన
రైతు సమగ్ర సర్వేకు మంచి స్పందన ఉంది. గతంలో ప్రభుత్వం చేసిన సర్వేలపై ప్రజల్లో మంచి అభిప్రాయం కాబట్టి సహకరిస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, భూ రికార్డుల ప్రక్షాళన తదితర సర్వేల వల్ల ప్రజలకు మంచి ఫలితాలు అందివచ్చాయి. గ్రామాల్లో సమాచారం ఇచ్చింది తడువుగా స్వచ్ఛందంగా ఆధార్, పట్టా పాస్‌బుక్‌తో సహకరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 160గ్రామాల్లో సర్వే పూర్తయింది. 104 మంది ఏఈవోలు, 22మంది ఏవోలు పనిచేస్తున్నారు. వేసవి ఎండల కారణంగా ఉదయం, సాయంత్రం సర్వే నిర్వహిస్తున్నారు. మే 20 వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.
- శ్రావణ్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...