తొలిరోజు ఎంపీటీసీ స్థానాలకు 7 నామినేషన్లు


Tue,April 23, 2019 12:09 AM

దుబ్బాక, నమస్తే తెలంగాణ: ప్రాదేశిక ఎన్నికలలో భాగంగా తొలి విడుతలో జరుగనున్న నియోజకవర్గంలో సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజున నియోజకవర్గంలో 7 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. దుబ్బాక మండలంలో 5 నామినేషన్లు వచ్చాయి. ఇందులో హబ్షీపూర్ ఎంపీటీసీ స్థానానికి అస్క రవి (టీఆర్‌ఎస్), మాలి స్వామి (స్వతంత్ర) అభ్యర్థులుగా నామినేషన్లు సమర్పించారు. ఆకారం ఎంపీటీసీ స్థానానికి రఘోత్తంపల్లికి చెందిన పోలబోయిన లక్ష్మి (టీఆర్‌ఎస్), రాజక్కపేట ఎంపీటీసీ స్థానానికి కొంగరి రాజయ్య, తిమ్మాపూర్ ఎంపీటీసీ స్థానానికి రామారం మాధవి (స్వతంత్ర) అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. మిరుదొడ్డి మండలంలో ఎంపీటీసీ స్థానానికి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇక తొగుట, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో ఒక్క నామినేషన్ సెట్ దాఖలు కాలేదు. ఈ మూడు మండలాల్లో తొలిరోజున జడ్పీటీసీ, ఎంపీటీసీలకు నామినేషన్లు రాకపోవటం విశేషం. అదేవిధంగా నియోజకవర్గంలో జడ్పీటీసీ స్థానాలకు ఒక్క నామినేషన్ రాకపోవటం గమనార్హం.

రెండు ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు
మిరుదొడ్డి: మే నెల 6వ తేదీన జరుగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గాను మిరుదొడ్డి మండల పరిధిలోని ధర్మారం నుంచి టీఆర్‌ఎస్, అల్వాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు తమ నామినేషన్లను సోమవారం దాఖలు చేసినట్లు మిరుదొడ్డి ఎంపీడీవో, ఎన్నికల అధికారి రాగపేట మల్లికార్జున్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను తప్పని సరిగా పాటించాలని సూచించారు. 22వ తేదీ నాటికి రెండు నామినేషనులు దాఖలైనట్లు పేర్కొన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...