ఎన్నికల నిబంధనలను తప్పనిసరి పాటించాలి: ఆర్‌వో


Tue,April 23, 2019 12:09 AM

దుబ్బాక, నమస్తే తెలంగాణ: ప్రాదేశిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలని దుబ్బాక జడ్పీటీసీ రిటర్నింగ్ అధికారి హరికిషన్ సూచించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా దుబ్బాకలో ఎంపీడీవోతో పాటు రిటర్నింగ్ అధికారులను నియమించారు. ఇంతవరకు చిన్నకోడురు ఎంపీడీవో రాజేశ్ దుబ్బాక ఇన్‌చార్జి ఎంపీడీవోగా వ్యవహరించారు. ప్రస్తుతం దుబ్బాక ఎంపీడీవోగా మధుసూదన్ నియామితులయ్యారు. ప్రాదేశిక ఎన్నికలకు జడ్పీటీసీ ఆర్‌వోగా హరికిషన్ (నీటిపారుదల శాఖ డీఈ) వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఎంపీటీసీల ఆర్‌వోలుగా చక్రపాణి, తిరుపతి, పెంటయ్య, సుధాకర్, నాగభూషణం వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ రిటర్నింగ్ అధికారి హరికిషన్ మాట్లాడుతూ...ఎన్నికల నిబంధనల మేరకు అభ్యర్థులు తమ వివరాలను పూర్తిగా నామినేషన్ పత్రాలలో సమర్పించాలని సూచించారు. నామినేషన్ సెట్ సమర్పించే సమయంలో అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. కార్యాలయానికి వంద మీటర్ల దూరంలో వాహనాలు, అభ్యర్థుల సహచరులు ఉండాలని సూచించారు. నామినేషన్ సెట్‌తో అభ్యర్థులపై కేసులు ఉంటే వాటి వివరాలు, ఆస్తులు, సంతానం, కులం, బ్యాంకు ఖాతా, ధ్రువపత్రాలను జతపరుచాలని సూచించారు. ఈ సమయంలో ఎంపీడీవో మధుసూదన్ తదితరులున్నారు.

శాంతియుత వాతావరణంలో ఎన్నికలు
తొగుట: మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని గజ్వేల్ ఏసీపీ నారాయణ తెలిపారు. సోమవారం తొగుట మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల నామినేషన్ ఏర్పాట్లను తొగుట సీఐ రవీందర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికలు సక్రమంగా జరగడానికి రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు సహకరించాలన్నారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. తొగుటతో పాటు రాయపోల్, దౌల్తాబాద్ మండలాల్లో పర్యటించానన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజిరెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...