ఇంట్లో చోరీ


Tue,April 23, 2019 12:08 AM

సిద్దిపేట టౌన్ : ఇంటి తాళాలు పగులగొట్టి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడిన సంఘటన సిద్దిపేట వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని గణేశ్‌నగర్‌కు చెందిన మాచర్ల సత్యనారాయణ తల్లి శ్రీనగర్ కాలనీలో నివాసముంటుంది. ఇటీవల సత్యనారాయణ తండ్రి మృతి చెందాడు. ఈ నెల 19న శ్రీనగర్ కాలనీలో ఉంటున్న అమ్మవద్దకు సత్యనారాయణ వెళ్లి గణేశ్‌నగర్ తన నివాసానికి తీసుకవచ్చాడు. ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో గల నాలుగున్నర తులాల నల్లపూసల దండ, రెండు తులాల శంఖుఉంగరం, వంక ఉంగరంతో పాటు రూ.2వేల నగదు అపహరించారు. విషయాన్ని ఇంటి పక్క నివాసముంటున్న ఓ వ్యక్తి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లాడు. ఇంట్లో బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని సత్యనారాయణ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు డాగ్ స్కాడ్, క్లూస్ టీమ్‌తో వెళ్లి ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...