గోదావరి జలాలతో ఎల్లమ్మతల్లికి అభిషేకం


Sun,April 21, 2019 11:24 PM

-దేవతల దీవెనతో వేగంగా ప్రాజెక్టు పనులు
-రంగనాయకసాగర్ రిజర్వాయర్‌తో...
చిన్నకోడూరు సస్యశ్యామలం
-ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా మారనుంది
-మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
చిన్నకోడూరు: ఎల్లమ్మతల్లి దయతో ఈ ప్రాంతమంతా ఆకుపచ్చగా మారుతున్నది.. గోదావరి జలాలు రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లోకి రాగానే ఎల్లమ్మతల్లికి అభిషేకం చేద్దాం.. ఈ ప్రాంతమంతా పాడి పంటలతో, పర్యాటక కేంద్రంగా రూపాంతరం చెందుతుందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలోని శ్రీరేణుకా ఎల్లమ్మ దేవాలయం రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న విషయం తెలిసిందే. శ్రీరేణుకా ఎల్లమ్మ నూతన దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే ఆదివారం భూమిపూజ చేశారు. పెద్దకోడూరులోని రిజర్వాయర్ పక్కన నూతనంగా శ్రీహనుమాన్ దేవాలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. చంద్లాపూర్‌లో మడియాలమ్మ దేవాలయానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ దీవెనతో వర్షాలు సమృద్ధిగా కురిసి ఈ ప్రాం తంలో కరువు పోవాలన్నారు. రంగనాయకసాగర్ రిజర్వాయర్‌తో ఈ ప్రాంతం సిరుల పంటలతో విరాజిల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. దేవుళ్ల దీవెన ఉంటే ఎంతటి కార్యమైన నిర్విఘ్నంగా పూర్తవుతుందన్నారు. ఎల్లమ్మతల్లి దయతో ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని అన్ని హం గులతో ఆదర్శంగా నిర్మిస్తామని తెలిపారు.

చంద్లాపూర్‌లో డబుల్ బెడ్‌రూం ఇండ్ల పరిశీలన
లక్ష్మీరంగనాయకస్వామి గుట్ట కింద నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పరిశీలించారు. నిర్మాణ పనులన్నింటినీ త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో 51డబుల్ బెడ్‌రూం ఇండ్లు అన్ని హంగులతో నిర్మించడం జరుగుతుందన్నారు. అర్హులందరికీ ప్రభు త్వం డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టించి ఇస్తుందన్నారు. ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్ కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ రామచంద్రం, సొసైటీ చైర్మన్లు బాల్‌రెడ్డి, పాపయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యుడు కాముని శ్రీనివాస్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కనకరాజు, టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు మహేశ్, సర్పంచ్‌లు చంద్రకళ రవి, లింగం, ఎంపీటీసీలు అరుణ చంద్రమౌళిగౌడ్, భాగ్యలక్ష్మి బాల్‌నర్సయ్యగౌడ్ ఉన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...