ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి


Sat,April 20, 2019 11:35 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి రైతులు మద్దతు ధరను పొందాలని జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్ అన్నారు. శనివారం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో సివిల్ సైప్లె సహకార సంఘం సంయుక్తంగా నిర్వహించే కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. బహిరంగ మార్కెట్‌లో దళారులు తూకం, మద్దతు ధర చెల్లించడంలోనూ మోసం చేసే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే విక్రయించుకోవాలన్నారు. జిల్లాలో సహకార సంఘాల ద్వారా 56 కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో మొదటగా హుస్నాబాద్ మార్కెట్‌లో ప్రారంభించామన్నారు.కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చేటప్పుడు విధిగా ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్, పట్టాదార్ పాసుపుస్తకం జిరాక్స్ కాపీలను వెంట తెచ్చుకోవాలన్నారు.

ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టుకొని మాత్రమే కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించే రైతులకు మూడు రోజుల్లో చెల్లింపులు చేయడం జరుగుతుందన్నారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ.1,770, బి గ్రేడ్‌కు రూ.1,750 మద్దతు ధర వస్తుందన్నారు. రైతులందరూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, డీసీవో సూపరింటెండెంట్ ప్రశాంత్‌రెడ్డి, సీనియర్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖరవర్మ, మార్కెట్ కార్యదర్శి ఎ.సరోజ, డైరెక్టర్ మిల్కూరి రవీందర్, నాయకులు బీలూనాయక్, గొర్ల వీరన్న, మ్యాక నారాయణ, నరేందర్‌రెడ్డి, బండి రమణారెడ్డి, లాల్‌సింగ్, సింగిల్‌విండో సీఈవో తిరుమల, రైతులు, మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...