భూనిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం


Sat,April 20, 2019 11:35 PM

సిద్దిపేట టౌన్ : జిల్లాలో రిజర్వాయర్ల నిర్మాణంలో ముంపునకు గురయ్యే ప్రతిపాదిత గ్రామాల్లో సామాజిక, ఆర్థిక స్థితిగతులపై సర్వే చేపట్టనున్నామని, భూనిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం భూసేకరణ పునరావాస, పునరోపాధి కల్పనపై ఆర్‌అండ్‌ఆర్ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృష్ణభాస్కర్ మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో సర్వేకు వచ్చే అధికారులకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. పూర్తి సమాచారాన్ని నమోదు చేసుకునేలా సహకారం చేస్తూ సర్వేను విజయవంతం చేయాలని చెప్పారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ పద్మాకర్, సిద్దిపేట ఆర్డీవో జయచంద్రారెడ్డి, గజ్వేల్ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, ఆర్‌అండ్‌ఆర్ చెల్లింపులు చేయాల్సిన అంశాలపై కమిటీ సభ్యులు వంటేరు ప్రతాప్‌రెడ్డి, నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఎల్లం, ఏటిగడ్డ కిష్టాపూర్ సర్పంచు దామరంచ ప్రతాప్‌రెడ్డిలతో పాటు ప్రతిపాదిత ముంపునకు గురయ్యే గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులతో 26 మంది సభ్యుల బృందం సుదీర్ఘంగా చర్చలు జరిపింది. చర్చలో పాల్గొన్న వారందరూ తమ అభిప్రాయాలను వెల్లడించారు.

గ్రామాల్లో 30 మంది మిగిలిపోయిన వారికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని రాంపూర్ గ్రామ సర్పంచ్ తెలిపారు. గ్రామాల్లో ఉండి జీవనోపాధికి వలసపోయిన వారికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని వంటేరు ప్రతాప్‌రెడ్డి కోరారు. పిల్లల చదువుల కోసం వలసపోయిన వారికి ప్యాకేజీ ఇవ్వాలని నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ అన్నారు. మరికొందరు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ ఎస్‌ఈలు వేణు, ఆనంద్, ఆర్‌అండ్‌వీఈఈ సుదర్శన్, డీఈ విష్ణు, మహిళా ప్రతినిధి విజయ, ఎస్సీ, ఎస్టీ ప్రతినిధి పల్లెపహాడ్ జయరామ్, షెడ్యూల్ తెగల ప్రతినిధి శివకుమార్, ఎర్రవల్లి, వేములగట్టు సర్పంచ్ బాలయ్య, లకా్ష్మపూర్ సర్పంచ్ స్వామి, పల్లె పహాడ్ చిన్న రజిత, బ్రాహ్మణ బంజేరుపల్లి రాములు, రాంపూర్ సర్పంచు శ్యామల, చెలుకలపల్లి సర్పంచు జీవిత, ఎర్రవల్లి, ఆకారం బాలమణి, లక్ష్మి, తిప్పారం పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...