ఉత్తమ శిక్షణకు కేంద్రం కితాబు


Wed,April 17, 2019 11:42 PM

సిద్దిపేట అర్బన్: సిద్దిపేట జిల్లాలో నిరుద్యోగ ని ర్మూలనలో భాగంగా యువతలో నైపుణ్యాలు పెంచి, వారికి ఉపాధి మార్గాన్ని చూపడమే లక్ష్యంగా మెరుగైన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న సిద్దిపేట ఆంధ్రా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థకు 2017-18కి గానూ అత్యుత్తమ ఏ గ్రేడ్‌ను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రదానం చేసిందని సంస్థ డైరెక్టర్ బీ శ్రీనివాస్‌రావు తెలిపారు. బుధవారం శిక్షణా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫ్యాకల్టీ ఎండీ నజీముద్దీన్ తో ఆయన మాట్లాడారు. గడిచిన 2018-19లో గ్రామీణాభివృద్ధి శాఖ నిర్దేశించిన లక్ష్యం 600 మంది కాగా, లక్ష్యాన్ని మించి 608 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. జిల్లా కేంద్రంలో ఈ శిక్షణ సంస్థను 2015 నవంబరు 27న ప్రారంభించామని, మూడేండ్లలో గణనీయ ప్రగతి సాధించి సంస్థ ఆదర్శంగా ని లిచిందన్నారు. మొత్తం 74 బ్యాచుల్లో 2194 మంది నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వగా, ఇందులో 1560 మంది వారి జీవితంలో స్థిరపడ్డారన్నారు.

వీ రిలో 645 మందికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇ ప్పించామన్నారు. రాబోయే 2019-20లో తమ శిక్షణా సంస్థ ద్వారా సీసీ టెక్నీషియన్స్, కంప్యూటర్ హార్డ్డ్‌వేర్, కంప్యూటర్ ట్యాలీ, డీటీపీ, సెల్‌ఫోన్ సర్వీసింగ్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏయిర్ కండీషనింగ్, ఫొటోగ్రఫీ అండ్ వీడీయోగ్రఫీ, కారు డ్రైవింగ్ శిక్షణను పురుషులకు ఇస్తామన్నారు. కట్టు శిక్షణ, బ్యూటీపార్లర్, జనపనారతో బ్యాగుల తయారీ, మగ్గం వర్క్, కంప్యూటర్ ట్యాలీ, కంప్యూటర్ డీటీపీ శిక్షణను స్త్రీలకు ఇస్తామన్నారు. పాడిపరిశ్రమ, గొర్రెల పెంపకం, తదితర శిక్షణలను రైతులకు ఇస్తామన్నారు. ఆసక్తిగల నిరుద్యోగులు మూడు కలర్ ఫొటోలతో పాటు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, జిరాక్స్ ప్రతులతో తమ సంస్థకార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 08457-225944, 9515323204 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సంస్థ సిబ్బంది మొహమ్మద్ నజీమ్, మీనా, కనకయ్య, అరవింద్, జ్యోతిర్మయి, ప్రణిత, కనుకవ్వ తదితరులు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...