ముంపు బాధితులను ఆదుకుంటాం..


Wed,April 17, 2019 11:42 PM

తొగుట: మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులందరినీ ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని సిద్దిపేట జేసీ పద్మాకర్ తెలిపారు. మండలంలో లకా్ష్మపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లిలో బుధవారం నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సామాజిక, ఆర్థిక గణన, సర్వేకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. అధికారులకు సహకరిస్తేనే అన్ని విధాల పరిహారం అందుతుందన్నారు. ముట్రాజ్‌పల్లి గ్రామంలో నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు వెయ్యి వరకు నిర్మించారని, మిగతా నిర్మాణాలు కొనసాగుతాయన్నారు. కొద్ది రోజుల్లో ముట్రాజ్‌పల్లిలో ఇండ్ల స్థలాలు చూపిస్తామన్నారు. స్ట్రక్చర్లకు సంబంధించి పరిహారం రాకుంటే తమ దృష్టికి తేవాలన్నారు. 18ఏండ్లు నిండిన వారందరికీ 250 గజాల స్థలంతో పాటు రూ.5లక్షల పరిహారం అందిస్తామన్నారు.

పెండ్లి అయిన ప్రతి కుటుంబానికి 250 గజాల ఇంటి స్థలంతో పాటు రూ.7.50 లక్షల ప్యాకేజీ, ఇల్లు నిర్మించి ఇస్తామని, ఇల్లు వద్దనుకుంటే రూ.5.04లక్షల పరిహారం ఇస్తామని చెప్పారు. ఇప్పటికే సింగారం, ఎర్రవల్లి గ్రామాల ప్రజలకు సంబంధించి నోటీస్‌లను పంచాయతీల్లో అంటించామన్నారు. ఇక్కడ కూడా సహకరిస్తే, వారం రోజుల్లో ఆర్‌ఆండ్‌ఆర్ ప్యాకేజీ ఇస్తామన్నారు. గ్రామానికి చెందిన యువకుడు పాషా మాట్లాడుతూ ఒంటరి మహిళలు, పురుషులు, గల్ఫ్ వెళ్లిన వారికి కూడా ఆర్‌ఆండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. కొండపోచమ్మ ప్రాజెక్టులో ఇస్తున్న తరహాలో ఇక్కడ కూడా స్ట్రక్చర్‌లకు పరిహారం ఇవ్వాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీవో జయచంద్రారెడ్డి, తహసీల్దార్ వీర్‌సింగ్, ఆర్‌ఐలు అశోక్, రవిందర్, వీఆర్‌వోలు అజయ్, దేవ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...