అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు అవసరం


Tue,April 16, 2019 11:14 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ : అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు ఎంతో అవసరమని హుస్నాబాద్ ఫైర్ స్టే షన ఇన్‌చార్జి ఎన్ నరేశ్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా హుస్నాబాద్‌లోని వెంకటేశ్వర సినిమా థియేటర్‌లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరుగడానికి ఉన్న పరిస్థితులను ముందే అంచనా వేసి ఒకవేళ జరిగితే వెంటనే ప్రమాదం పెద్దది కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా జనాభా రద్దీగా ఉండే థియేటర్లలో పకడ్బందీ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే 101 నంబరుకు గానీ, దగ్గరలో ఉన్న అగ్నిమాపక కేంద్రానికి గానీ సమాచారం ఇస్తే వెంటనే స్పందించి ఫైర్ ఇం జన్‌తో ప్రమాదం వద్దకు చేరుకుంటారన్నారు. వెంటనే సమాచారం ఇవ్వడం ద్వారా అగ్ని ప్రమాదంలో ప్రాణ, ఆస్థినష్టం జరుగకుండా కాపాడుకోవచ్చన్నారు. అనంతరం థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులకు అగ్ని ప్రమాదాల నివారణ చర్యలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది, సినిమా థియేటర్ యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...