కార్యదర్శుల రాకతో పంచాయతీల పాలన మెరుగు


Tue,April 16, 2019 11:14 PM

కోహెడ : నూతన కార్యదర్శుల రాకతో పంచాయతీల పాలన మెరుగవుతుందని ఎంపీపీ ఉప్పుల స్వామి అ న్నారు. నూతనంగా మండలానికి 15 మంది కార్యదర్శులు రాగా వారిని సోమవారం విధుల్లో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గ్రామపంచాయతీల సౌలభ్యం కోసం పెద్ద ఎత్తున కార్యదర్శుల నియామకాలు చేపట్టారన్నారు. 27 గ్రామపంచాయతీలకు గానూ ఇప్పటి వరకు ఉన్న 11 మంది కార్యదర్శులతో తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. ప్రస్తుతం మరో 15మంది కార్యదర్శుల రాకతో ఇబ్బందులు తొలిగిపోతాయన్నారు. ఆరెపల్లెకు సి.భాను ప్రకాష్, బత్తులవానిపల్లెకు వి. ప్రసాద్, చెంచెల్‌చెర్వుపల్లెకు బొమ్మగాని సురేశ్, ధర్మసాగర్‌పల్లెకు ఐలేని మధు, ఎర్రగుంటపల్లెకు బొలుమల్ల రాము, కాచాపూర్‌కు ఎ. గౌతమ్, నకిరెకొమ్ములకు డి. శ్రీనివాస్, పరివేదకు ఆర్. మమత, పోరెడ్డిపల్లెకు డి. శ్రీ కాంత్, తీగలకుంటపల్లెకు ఇరుమల్ల శ్రీనివాస్, విజయ్‌నగర్‌కాలనీకి భూక్య దేవేందర్, వింజపల్లికి ఎండీ అజారుద్దీన్, నారాయణాపూర్‌కు లావుడ్య శ్రీకాంత్‌నాయక్ నియమితులు కాగా వారిని విధుల్లో చేర్చుకున్నామన్నారు. ఇందులో కో ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రహీం, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ తదితరులున్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...