ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కలిసిన కమలాయపల్లి గ్రామస్తులు


Tue,April 16, 2019 11:12 PM

మద్దూరు : కమలాయపల్లి, అర్జున్‌పట్ల గ్రామాలను చేర్యాల మండలంలో విలీనం చేయాలని కోరుతూ కమలాయపల్లి సర్పంచ్ ఓరుగంటి అంజయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులు సోమవారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలుసుకొని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మద్దూరు మండల కేంద్రానికి రెండు గ్రామాలు సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ప్రభుత్వ పనుల కోసం మండల కేంద్రానికి వెళ్లేందుకు రెండు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 12కిలోమీటర్ల దూరంలో ఉన్న చేర్యాల మండలంలో కలుపాలని గత ముఫ్పై ఏండ్లుగా రెండు గ్రామాల ప్రజలు ఉద్యమిస్తున్నారని గుర్తు చేశారు. చేర్యాల మండలంలో కలిపి రెండు గ్రామాల ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలని ఎమ్మెల్యేని కోరడంతో అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఇప్పటికే రెండు గ్రామాలను చేర్యాల మండలంలో కలుపాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖను రాశానని ఎమ్మెల్యే తమతో చెప్పినట్లు వివరించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గుత్తి శ్రీనివాస్ నాయకులు వజ్రోజు శంకరాచారి, శనిగరం తిరుపతి, గుజ్జ బుచ్చిరెడ్డి, కొల్పుల మల్లేశం, ఓరుగంటి శంకర్, బాలయ్య, గుజ్జ జనార్దన్‌రెడ్డి, కంకటి రమేశ్, శనిగరం కనకయ్య తదితరులు ఉన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...