విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి


Tue,April 16, 2019 11:12 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం కల్పిస్తున్న వసతుల ను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగితే విజయం సాధించవచ్చని ట్రైనీ ఐపీఎస్, చే ర్యాల ఎస్‌హెచ్‌వో డా.పి.శబరీష్ అన్నారు. మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలోని కస్తూర్బాగాంధీ విద్యార్థులకు చేర్యాల కేజీబీవీలో ప్రత్యేక సమ్మర్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాలలో జరిగిన ప్రారంభ కార్యక్రమానికి డా.శబరీష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు తమకున్న వనరులతో పాటు ప్రభుత్వ వసతులను సద్వినియోగం చేసుకొని ముం దుకు సాగాలని కోరారు. ఏకాగ్రత, పట్టుదలతో అభ్యసిస్తే విజయం సాధించవచ్చని, తరగతి గదిలో టీచర్లు బోధిస్తున్న ప్రతి అంశాన్ని అవగతం చేసుకోవాలన్నారు.

అనుమా నం ఉం టే వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. కేజీబీవీలో ఏ ర్పాటు చేసిన క్యాంపును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం జీసీడీవో మనీల మాట్లాడుతూ కస్తూర్బాగాంధీ పా ఠశాలలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైనదని, విద్యార్థులు క్యాంపులో పాల్గొని అన్ని అంశాల పై అవగాహన పెంచుకోవాలని కోరారు. క్యాంపులో పాల్గొన్న విద్యార్థులు అన్ని విషయాల్లో ముందుండి ప్రగతి సాధించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈవో జి.రాములు, మోటివేటర్‌లు బాపురెడ్డి, రాజ్‌మహ్మద్, ఆర్పీలు ఎన్.చంద్రారెడ్డి, వి.విమలాకర్, ఎం.వెంకటేశ్వర్లు, వి.శ్రీనివాస్, బి.నరహరి, ఎం.గణేశ్, ఎ.భాగ్యలక్ష్మి, మాలతి, సుజాత, కొండయ్య, సతీశ్, కేజీబీవీ ఎస్‌వో, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...