రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం: ఏవో


Tue,April 16, 2019 11:12 PM

మిరుదొడ్డి: రైతుల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తుందని మిరుదొడ్డి వ్యవసాయ అధికారి బోనాల మల్లేశం అన్నారు. సోమవారం మిరుదొడ్డి వ్యవసాయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏవో మాట్లాడుతూ...ఈ నెల 16వ తేదీ నుంచి మే 16వ తేదీ వరకు రైతు సమగ్ర సమాచార సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. వ్యవసాయ అధికారులు ఒక్కొక్క గ్రామంలో మూడు రోజుల పాటు ఉంటూ రైతుల నుంచి పూర్తి స్థాయిలో వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా 20 గ్రామ పంచాయతీల్లో 13,702 మంది రైతులకు గాను 35 వేలు ఎకరాల వ్యవసాయ భూముల పై సర్వే చేస్తారని పేర్కొన్నారు. ఆయా గ్రామాల విచ్చేసే అధికారులకు రైతులు తమ ధార్ కార్డు, బ్యాంకు అకౌంట్, పట్టాదారు పాసు బుక్కుల జీరాక్సు పత్రాలను అందజేయాలని సూచించారు. ఈ నెల 16న రుద్రారం, వీరారెడ్డిపల్లి, అల్మాజీపూర్, లింగుపల్లి, భూంపల్లి గ్రామాల్లో సర్వేలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ఏఈవోలు లోహిత్, సాయికుమార్, రేణుక, సమ్రీన్, అఖిల్ హుస్సేన్ ఉన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...