అట్టహాసంగా శేరి ప్రమాణ స్వీకారం


Tue,April 16, 2019 01:10 AM

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: శాసన మండలిలోని జూబ్లీహాల్‌లో మెదక్ జిల్లాకు చెందిన శేరి సభాష్‌రెడ్డి ఎమ్మెల్సీగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్ నేతి విద్యాసాగర్ ఎమ్మెల్సీగా శేరి సుభార్‌రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంద్ర కరణ్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రభుత్వ వీప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలతో పాటు శేరి సుభాష్‌రెడ్డి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఎంపీ అభ్యర్థులు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, మదన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్, మాణిక్‌రావు, జెడ్పీ చైర్మన్ రాజమణి మురళీయాదవ్, టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు మేడిశెట్టి శ్యామ్‌రావు, జెల సుధాకర్, మెదక్, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్లు మల్లికార్జున్‌గౌడ్, గాడిపల్లి భాస్కర్, కౌన్సిలర్లు, మాజీ మార్కెట్ కమటీ చైర్మన్ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్వీ నాయకుడు పడాల సతీశ్, జీవన్‌రావు, నాయకులు కిష్టాగౌడ్, గంగాధర్ తదితరలు జూబ్లీహాల్‌కు చేరుకుని పూష్పగుచ్ఛం అందించి శేరి సుభాష్‌రెడ్డికి అభినందనలు తెలిపారు.

మెదక్ నుంచి హైదరాబాద్‌కు తరలివెళ్లిన నాయకులు, కార్యకర్తలు...
మెదక్, హవేళిఘనపూర్ మండలాలకు చెందిన టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు శేరి సుభాష్‌రుడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హైదరాబాద్‌కు తరలివెళ్లారు. మెదక్, హవేళిఘనపూర్ మండలాలకు చెందిన టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు మెదక్‌కు చేరుకుని రాందాస్ చౌరాస్తాలో పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌కు వాహనాల్లో తరలివెళ్లారు. మెదక్ నియోజకవర్గంలోని హవేళిఘనపూర్, మెదక్‌టౌన్, పాపన్నపేట, చిన్నశంకరంపేట మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు.

సందడిగా మారిన జూబ్లీహాల్ ప్రాంగణం...
జూబ్లీహాల్‌లో ఎమ్మెల్సీగా శేరి సుభాష్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డితో పాటు బయటకు వచ్చి నాయకలు, కార్యకర్తలకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్‌లో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, నాయకులను కలిసి వారితో మాట్లాడారు. అనంతరం మెదక్ నియోజకవర్గం నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజ్, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు హాజరై ఎమ్మెల్సీని అభినందించారు.

ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అందోల్, నమస్తే తెలంగాణ : శాసనమండలి సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కలిశారు. సోమవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలోని జూబ్లీహాల్‌లో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛాన్ని సమర్పించి, శుభాకాంక్షలను తెలియజేశారు. భవిష్యత్‌లో ఆయనకు మరిన్ని ఉన్నతమైన పదవులు వరించాలని ఆకాంక్షించారు. ఆయనతో పాటు డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ పి.జైపాల్‌రెడ్డి, డిక్కీ రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్ కిరణ్, జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, జోగిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా జోగినాథ్‌లు ఉన్నారు.

ఎమ్మెల్సీ శేరికి ఘన సన్మానం..
జహీరాబాద్, నమస్తే తెలంగాణ : జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు హైదరాబాద్‌లోని శాసనమండలి సమావేశ మందిరంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిని కలసి సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మెల్సీలకు అభినందనల వెల్లువ..
నర్సాపూర్, నమస్తే తెలంగాణ : నూతనంగా ఎన్నికై మం గళవారం ప్రయాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీలను టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ దంపతులు కలిసి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గె మల్లేశంలను నగరంలో కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు.

ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేత..
తూప్రాన్, నమస్తే తెలంగాణ : ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన శేరి సుభాష్‌రెడ్డిని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డితో కలిసి టీఆర్‌ఎస్ మండల నాయకులు, ఆత్మకమిటీ వైస్ చైర్మన్ బాబుల్‌రెడ్డి, యావాపూర్ సర్పంచ్ నర్సింహారెడ్డిలతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కూర రఘోత్తంరెడ్డి
కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన కూర రఘోత్తంరెడ్డిచే సోమవారం శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రి జగదీశ్వర్‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...