అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి


Mon,April 15, 2019 12:01 AM

దుబ్బాక,నమస్తే తెలంగాణ: అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సూచించారు. అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు దుబ్బాక నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో ఆదివారం అంబేద్కర్ విగ్రహాలకు, చిత్ర పటాలకు పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలను నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గంలో పలు గ్రామాల్లో నిర్వహించిన జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...భారత రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ బడుగు,బలహీన వర్గాల వారికే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శంగా నిలిచారని కొనియడారు. ఆయన కల్పించిన ఓటుహక్కుతో ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమైందని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి పౌరుడు తమవంతుగా కృషి చేయాలని సూచించారు. దుబ్బాక మండలంలో చిట్టాపూర్‌లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఎంపీపీ ర్యాకం పద్మాశ్రీరాములు, సర్పంచ్ పోతనక రాజయ్య, నాయకులు దయాకర్, పెద్దగుండవెళ్లిలో సర్పంచ్ రాజిరెడ్డి నాయకులు సత్యం, సంజీవ్‌రెడ్డి, వేణు, హబ్సీపూర్‌లో సర్పంచ్ అస్క శ్రీనివాస్, నాయకులు అస్క రవి, స్వామి, రాజలింగంగౌడ్ తదితరులున్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...