డా.బీఆర్.అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి


Mon,April 15, 2019 12:01 AM

చేర్యాల, నమస్తే తెలంగాణ : డా.బీ.ఆర్.అంబేద్కర్ ఆశయాల సాధనకు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలని టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్, రాష్ట్ర నాయకులు ముస్త్యాల బాల్‌నర్సయ్య, అధికార ప్రతినిధి పుర్మ ఆగంరెడ్డి పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతిని ఆదివారం మండల వ్యాప్తంగా టీఆర్‌ఎస్ , అంబేద్కర్ సంఘం, యువజన సంఘాలు, కుల సంఘాలు వేర్వేరుగా ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంగడి బజారులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్, మాల మ హానాడు, షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి, ఉపాధ్యా సం ఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించడంతో పాటు కేకులు కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ అధ్యక్షురాలు ముస్త్యాల అరుణ, యూత్ అ ధ్యక్షుడు శివగారి అంజయ్య, టౌన్ అధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్వీ మండల అధ్యక్షు డు మంగోలు చంటి, జిల్లా నాయకుడు తాడెం కృష్ణమూర్తి, టౌ న్ కార్యదర్శి గోనె హరి, మాజీ ఉపసర్పంచ్ మంచాల కొండయ్య, పచ్చిమడ్ల సతీశ్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు చింతల పర్శరాములు, ము స్త్యాల కిష్టయ్య, మండల ప్ర ధాన కార్యదర్శి నర్ర ఐలయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షుడు జహీరోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కుల సంఘాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయా సంఘాల జిల్లా బాధ్యులు బుట్టి భిక్షపతి, బుట్టి సత్యనారాయణ, మల్లిగారి యాదయ్య, రామగల్ల పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా అంబేద్కర్ జయంతి
మద్దూరు : మండల వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ జయంతిని మండల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. లద్నూర్‌లో అం బేద్కర్ విగ్రహానికి ఎంపీపీ మంద మాధవి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మలిపెద్ది మల్లేశం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కంఠారెడ్డి జనార్దన్‌రెడ్డి, ఓరుగంటి అంజయ్య, భీంరెడ్డి మధుసూదన్‌రెడ్డి, జీడికంటి సుదర్శన్, కూకట్ల బాలరాజు, టీఆర్‌ఎస్ రాష్ట్ర మైనార్టీ నాయకుడు కె. ఆరీఫ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబాల మహేశ్‌గౌడ్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్, నాయకులు పుట్ట వెంకట్రమణారెడ్డి, తాజ్‌మహ్మద్, ఎజాజ్ అహ్మద్, వజ్రోజు శంకరాచారి, పాల్గొన్నారు.
రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి..
కొమురవెల్లి : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జ యంతిని ఆదివారం మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కొమురవెల్లి మండల కేంద్రంలో టీఆర్‌ఎస్వీ మండల అధ్యక్షుడు మహేశ్ ఆధ్వర్యంలో అంబేద్కర్‌కు నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు ఉ న్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...