సమాజ, ప్రకృతి ప్రతిబింబమే సాహిత్యం


Sun,April 14, 2019 12:01 AM

సిద్దిపేట టౌన్ : సాహిత్యం సమాజాన్ని, ప్రకృతిని ప్రతిబింబిస్తుందని రచయిత్రి, తెలంగాణ సాహిత్య కళాపీఠం అధ్యక్షురాలు దాసరి శాంతకుమారి అన్నారు. కరీంనగర్ జిల్లా ఫిలింభవన్‌లో శనివారం సాహితీ సంస్థ ఆధ్వర్యంలో గొస్కుల రమేశ్ సంపాదకత్వంలో నూతన కవిత ప్రక్రియ కైతికాలు ప్రథమ కవితా సంకలన ఆవిష్కరణ సభ నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజ అవసరాలకు అనుగుణంగా ఉద్యమాలు ఆవిర్భవించినప్పుడు ఆలోచనలో మార్పు చేసుకుంటున్నప్పుడు సాహిత్యంలో కూడా ఉద్యమస్ఫూర్తి ప్రవేశిస్తుందన్నారు. వస్తువులలోనూ, రూపంలోనూ కొత్త పోకడ తలెత్తుతుందని, కవిత్వంలో వస్తువు రూపం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయని చెప్పారు. పలువురు రచించిన రచనలపైన ఆమె మాట్లాడారు. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఆవిర్భవించి కవులను, పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయన్నారు. గొస్కుల రమేశ్ సాహిత్యంలో కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారని ఆమె అభినందించారు. అనంతరం శాంతకుమారిని సంపాదకుడు దాస్యం సేనాధిపతి, గొస్కుల రమేశ్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కవులు లక్ష్మయ్య, శ్రీరాములు, ప్రభాకర్, మధుసూదన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, తెలంగాణ సామాజిక రచయితల సంఘం అధ్యక్షుడు రాజేశం, సాహితీ రాష్ట్ర కార్యదర్శి గోపాల్, మాడుగుల రాములు, గంగాధర్, కవయిత్రులు తదితరులు పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...