పంచాయతీ కార్యదర్శులు వచ్చేశారు..


Sun,April 14, 2019 12:01 AM

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పల్లెలో మెరుగైన పాలన అందించేందకు కొత్త పంచాయతీ కార్యదర్శులొచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శి ఉండాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం. ఆ దిశగా జిల్లాలోని అన్ని పంచాయతీలకు కార్యదర్శులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి జిల్లాలో 305 మందికి నియమాక పత్రాలను కలెక్టర్ కృష్ణభాస్కర్, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబులు అందజేశారు. విధుల్లో చేరాలని అధికారులు ఆదేశించడంతో నియామక పత్రాలు అందుకున్న కార్యదర్శులు వారికి కేటాయించిన మం డలాలకు వెళ్లి రిపోర్టు చేస్తున్నారు. సోమవారం అందరూ విధుల్లో చేరనున్నారని అధికారులు తెలిపారు. జిల్లాలో 499 గ్రామపంచాయతీలుండగా, ఇది వరకు 165 మంది కార్యదర్శులు ఉన్నారు. దీంతో ప్రతి రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక్క కార్యదర్శిని నియమించడంతో వారి పైన పనిభారం ఎక్కువగానే పడింది. గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పాటు ప్రతి గ్రామంలో పెద్దఎత్తున హరితహారం చేపట్టడం, డంపు యార్డుల నిర్మాణం, వైకుంఠధామాలు నిర్మించడంతో పాటుగా ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు.

ప్రతి పల్లె ఆదర్శ పల్లెలు కావాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇవన్నీ సాధించాలంటే ప్రతి గ్రామానికి ఒక్క కార్యదర్శి ఉండాలని ప్రభుత్వం నిర్ణయించి పెద్దఎత్తున జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి గతేడాది ఆగస్టు మాసం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో 499 పంచాయతీలకు గాను 165 మంది కార్యదర్శులున్నారు. ఈ లెక్కన జిల్లాకు 338 మంది పంచాయతీ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసి రాత పరీక్షను నిర్వహించింది. అనంతరం అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేసి, డిసెంబర్‌లో విద్యార్హత పత్రాలను పరిశీలన పూర్తి చేశారు. వెంటనే నియామక పత్రాలు అందజేయాల్సి ఉండగా, పలు కారణాల వల్ల జాప్యం అయింది. లోకసభ ఎన్నికలు ముగిసిన వెంటనే జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నియమాక పత్రాలను అందజేశారు. జిల్లాలో 338 మందికి గాను ఇప్పటి వరకు 305 మందికి నియమాక పత్రాలను అందజేశారు. పాత కార్యదర్శులు 165, కొత్తగా విధుల్లోకి చేరుతుతన్న వారితోని కలుపుకొని మొత్తం 470 మంది కార్యదర్శులు అవుతారు. మిగిలిపోయిన వారికి త్వరలోనే ఉత్తర్వులు ఇచ్చి ఖాళీలను భర్తీ చేస్తారు. భవిష్యత్‌లో కార్యదర్శుల పనితీరు ఆధారంగానే పర్మినెంట్ చేస్తారు. విధుల్లో చేరేటప్పుడు ప్రత్యేకంగా ఒక బాండ్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ గ్రామాభివృద్ధికి పాటు పడాల్సి ఉంటుంది.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...