భయాన్ని వీడితే విజయం మీదే..


Sun,April 14, 2019 12:01 AM

మిరుదొడ్డి : విద్యార్థులు తమలోని భయాన్ని వీడితేనే విజయం వర్తిస్తుందని గురుకుల పాఠశాలల రాష్ట్ర కార్యదర్శి, సుప్రీం స్వేరో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం మిరుదొడ్డిలో భీమ్ దీక్షను పుస్కరించుకొని స్వే రోస్ నెట్ వర్కు వెస్టు జోన్ అధ్యక్షుడు తౌడ సత్యనారాయణ అధ్యక్షతన మహానీయుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహా త్మా జ్యోతిరావుఫూలే, సావిత్రిబాయి ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, కాన్షీరాం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల గురుకులాల ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.

అనంతరం ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బాంచన్.. కాల్మొక్తా.. నాకు జాబ్ ఇప్పించండి.. అని బతిమిలాడే కంటే.. విద్యార్థులు ఆత్మైస్థెర్యంతో ముం దుకు సాగి, జీవితంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తే ఎవరి ముం దు తలొంచే పరిస్థితి రాదు.. అని సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జ్ఞానం కోసం ఎక్కడా కూడా పూజలు, పునస్కారాలు చేసిన సం దర్భాలు లేవన్నారు. నిత్యం పేదరికం వెంటాడుతున్నా, కుల రక్కసి కోరల్లో కొట్టుమిట్టాడుతున్నా, వెనుకడుగు వేయకుండా ప్రపంచ నలుమూలల పుస్తకాలను చదివి జ్ఞానాన్ని సంపాదించి ప్రపంచ దేశాలు కొనియాడే మహానీయుడుగా అంబేద్కర్ నేడు ఉన్నారన్నారు. పేదరికంతో ఇబ్బందులను అనుభవిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా విద్యను అభ్యసించడానికి గురుకులాలను ఏర్పాటు చేస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్వేరోస్ నెట వర్కు సభ్యులు, ఆయా గ్రామాల్లోని ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...