పోటెత్తిన గజ్వేల్ ఓటరు చైతన్యం


Sat,April 13, 2019 02:32 AM

గజ్వేల్, నమస్తే తెలంగాణ: గజ్వేల్ ఓటర్ల రాజకీయ చైతన్యం మరోసారి రుజువైంది. లోక్‌సభ ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధిక పోలింగ్ శాతం నమోదు కావడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జిల్లాలో పోలింగ్ శాతం రెండో స్థానంలో నిలిచింది. రాజకీయ కూడలిగా భావించే గజ్వేల్ ప్రజల్లో సీఎం కేసిఆర్ స్థానికంగా ప్రాతినిథ్యం వహించడంతో మరింత ఉత్సాహాన్ని నింపింది. గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గజ్వేల్ నియోజక వర్గం 76.48శాతం పోలింగ్ నమోదైంది.
గజ్వేల్ రాజకీయ కూడలి లాంటింది. రాష్ట్ర రాజకీయాలకు గజ్వేల్ ఓటరు తీర్పు అద్దం పడుతున్నది. గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా గజ్వేల్ ఓటరు రాజకీయ చైతన్యం స్పష్టం అయింది. గతంలో కంటే అధికంగా పోలింగ్ శాతం పెరుగడం గమనార్హం. కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులు నామమాత్రంగా పోటీలో ఉండగా, ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్దగా ప్రచారం చేయక పోయారు. గజ్వేల్ నియోజకవర్గంలో 8 మండలాలు, 2 మున్సిపాలిటీలో అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ జరిగింది. 2,33,207 మంది జనాభాకు 2,05,699 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 88శాతం నమో దైంది. 2014లో 85శాతం, 2009లో 84శాతం, 2004లో 80శాతం నామోదైంది. గత 4పర్యాయలు కూడా 80శాతం మించి పోలింగ్ నామో దు కావడం గమనార్హం.
జిల్లాలోనే మొదటి స్థానం
గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గ పరిధిలోని గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 76.50శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాల్లోనే అత్యధిక శాతం పోలింగ్ గజ్వేల్‌లో జరుగడం గమనార్హం. సీఎం కేసీఆర్ పోలింగ్ శాతాన్ని పెంచాలని, ఓట్లు టీఆర్‌ఎస్‌కే వస్తాయి. టీఆర్‌ఎస్ వర్గాలకు సూచించారు. స్థానిక నాయకులు కూడా అదేవిధంగా పనిచేశారు. మాజీమంత్రి హరీశ్‌రావు, టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పనిచేశారు. నియోజకవర్గంలోని మనోహరాబాద్ మండలం అత్యధికంగా 82.47శాతం పోలింగ్ నమోదు కాగా, తర్వాత స్థానం ములుగులో 82.29శాతం నమోదైంది. మర్కూక్‌లో 79.34 శాతం, వర్గల్‌లో 78.06శాతం, కొండపాకలో 75.29 శాతం, తూప్రాన్‌లో 74.06 శాతం, గజ్వేల్‌లో 74శాతం, చివరగా జగదేవ్‌పూర్‌లో 73.69శాతం నమోదైంది.
12శాతం తగ్గింది
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు గజ్వేల్‌లో 12 శాతం పోలింగ్ తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల కన్నా లోక్‌సభ ఎన్నికలకు 16,395 మంది ఓటర్లు అధికమయ్యారు. 14,803 ఓట్లు అసెంబ్లీ పోలింగ్ కన్నా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తక్కువ నమో దైంది. జిల్లాలో చూస్తే మిగతా అన్ని నియోజక వర్గాలకన్నా గజ్వేల్‌లో పోలింగ్ శాతం అధికంగా ఉంది. గత ఎన్నికల కన్నా ఈ సారి పోలింగ్ బాగా పెరిగింది. మిగతా నియోజకవర్గాలకన్నా గజ్వేల్‌లో పోలింగ్ శాతం పెరుగడమే కాకుండా టీఆర్‌ఎస్ పార్టీకి మెజార్టీ కూడా పెరుగుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతుండగా కాంగ్రెస్ ఓట్లు తగ్గి కాస్త బీజేపీ ఓట్లు పెరిగే అవకాశాలున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
భారీ మెజార్టీ తథ్యం
గజ్వేల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీ వస్తుందని టీఆర్‌ఎస్ నాయకులు భావిస్తున్నారు. పలు గ్రామాల్లో కాంగ్రెస్ బీజేపీ, ఏజెంట్ల కొరత ఏర్పడగా అనేక గ్రామాల్లో ఆ పార్టీలు ప్రచారం కూడా చేయలేదు. ప్రజలు కూడా చాలా మంది స్వచ్ఛందంగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే పోలింగ్ శాతం గతంలో కన్నా పెరుగడంచ ఓటింగ్ సరళిని బట్టి గజ్వేల్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థికి లక్షకు పైగా మెజార్టీ వస్తుందని నాయకులు భావిస్తున్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...