చైతన్యం చాటారు.. ప్రగతికే పట్టం కడుతారు..


Sat,April 13, 2019 02:31 AM

వర్గల్ : పార్లమెంట్ ఎన్నికల్లో మండలంలోని ఓటర్లు సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకే ఓటు వేసినట్లు, ఎన్నికలు జరిగిన సరళిని బట్టి తెలుస్తున్నదని టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నాగరాజు తెలిపారు. శుక్రవారం నాచారంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామాల ఓటర్లు మరోసారి తమ ఓటు చైతన్యం చూపారని పేర్కొన్నారు. మండలంలో ఓటర్లు పెద్దఎత్తున ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ చైతన్యాన్ని చాటారన్నారు. మండల వ్యాప్తంగా 27 గ్రామ పంచాయతీల్లో 28,813 మంది ఓటర్లుండగా, వీరిలో 22,512 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా సీతారాంపల్లి 450ఓటర్లుండగా, 426మంది ఓటు వేశారు. 94,68 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత తున్కిమక్తా 88,68 శాతం, గోవిందాపూర్ 87,36 శాతంతో రెండు, మూడో స్థానంలో నిలిచినట్లు తెలిపారు. 78,13 శాతంతో ఓటర్లు ప్రభుత్వానికే పట్టం కట్టినట్లు ఎన్నికల సరళిని బట్టి అర్థమవుతుందన్నారు. కార్యక్రమంలో మం డల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పాశం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పూదరి యాదగిరిగౌడ్, మండల ఉపాధ్యక్షుడు లచ్చగౌని రాములుగౌడ్, గ్రామ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కట్టె వెంకటేశం, తున్కి మాజీ సర్పంచ్ గంగుమల్ల శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయకర్త టేకులపల్లి కిష్టారెడ్డి, నర్సింహ పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...