రంగంపేటలో 95శాతం పోలింగ్


Sat,April 13, 2019 02:31 AM

గజ్వేల్‌రూరల్: మండలంలోని రంగంపేట గ్రామంలో లోక్ సభ ఎన్నికల్లో 95శాతం ఓట్లు పోలైయ్యాయి. గురువారం జరిగిన ఎన్నికల్లో గ్రామంలో మొత్తం 434 ఓట్లు ఉండగా, 412 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామాల కన్నా రంగంపేట గ్రామం 95శాతం పోలింగ్ పూర్తిన గ్రామంగా మొదటిస్థానంలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రంగంపేట గ్రామంలోనే అధికశాతం పోలింగ్ జరిగింది. గ్రామంలో జరిగిన అభివృద్ధికి ప్రభావితమై ప్రజలంతా ఓటుహక్కును సద్వినియోగం చేసుకుంటున్నారని గ్రామ నాయకులు తెలిపారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...