శ్రీరామ నవమి ఉత్సవాలకు రావాలని కొత్త కు ఆహ్వానం


Sat,April 13, 2019 02:31 AM

ములుగు : శ్రీరామ నవమి ఉత్సావాల్లో పాల్గొనాలని మెదక్ పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. శుక్రవారం హైదారబాద్‌లోని ఆయన నివాసానికి ఉమ్మడి ములుగు మండల జడ్పీటీసీ సింగం సత్తయ్య ఆధ్వర్యంలో ఉత్సవ నిర్వాహకులు, గ్రామస్తులు ఆయనను కలుసుకొని ఆహ్వాన పత్రికను అందజేశారు. మండల పరిధిలోని క్షీరసాగర్‌లో గల కోదండరామాలయంలో ఏటా కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని సీతారాముల కల్యాణోత్సవానికి రావాలని స్వాగతించారు. కల్యాణోత్సవంలో భాగంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భగవంతుడి కృపకు పాత్రులుకాగలరని ఉత్సవ నిర్వాహకులు కోరారు. ఆహ్వానపత్రికను అందుకున్న కొత్త ప్రభాకర్‌రెడ్డి ఉత్సవాలకు వస్తానని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కాయితి యాదమ్మ నర్సింగరావు, మాజీ సర్పంచ్ వెంకటేశ్‌గౌడ్, ఎంపీటీసీ సురేశ్, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ బుజేందర్, ఉపసర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు కొన్యాల సంతోశ్‌రెడ్డి ఉన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...