కారుకు 16 ఖాయం


Sat,April 13, 2019 02:31 AM

మర్కూక్: లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టించనున్నదని జడ్పీటీసీ సింగం సత్త య్య అన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 16స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశాన్ని ఆకర్షించాయన్నారు. ఆయా దేశాల ప్రతినిధులు రాష్ర్టానికి వచ్చి చూసి అబ్బురపడి వారు కూడా తమ దేశంలో ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పారని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవ్వడం ఖాయమన్నారు. దేశంలో కేసీఆర్ ప్రధాన భూమికను పోషించడం నిజమని చెప్పారు. కారు కు ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...