తొగుటలో 76.52 శాతం పోలింగ్


Fri,April 12, 2019 12:07 AM

తొగుట: గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికలు తొగుట మండలంలో ప్రశాంతంగా ముగిసాయి. మండలంలో అత్యధికంగా పల్లెపహాడ్‌లో 89 శాతం పోలింగ్ జరగగా, అత్యల్పంగా తొగుటలో 70.15 శాతం నమోదయింది. మండలంలో. మొత్తం 25062 ఓటర్లకు గానూ 19178 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, 76.52 శాతం పోలింగ్ నమోదైంది. తుక్కాపూర్‌లో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, పల్లెపహాడ్‌లో జడ్పీటీసీ కొక్కొండ రూప పరిపూర్ణాచారి, ఎల్లారెడ్డిపేటలో ఎంపీపీ గంటా రేణుక రవీందర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలంలోని ఘనపూర్‌లో 1264/1668, లింగాపూర్‌లో 1140/ 1411, ఎల్లారెడ్డిపేటలో 1192/1680, జప్తిలింగారెడ్డిపల్లిలో 776/1011, కాన్గల్‌లో 1112/1460, పెద్దమాసాన్‌పల్లిలో 960/1240, పల్లెపహాడ్‌లో 1264/1416, ఏటిగడ్డ కిష్టాపూర్, లకా్ష్మపూర్ గ్రామాల్లో 2171/2798, గోవర్ధనగిరిలో 477/639, తొగుటలో 1594/2272, తుక్కాపూర్‌లో 685/899, వేములఘాట్‌లో 1511/2048, వర్ధరాజ్‌పల్లిలో 326/456, లింగంపేటలో 387/476, బండారుపల్లిలో 937/1235, గుడికందులలో 1280/1700, వెంకట్‌రావుపేటలో 1588/2032 చందాపూర్‌లో 514/621 ఓట్లు పోలయ్యాయి. ఘనపూర్‌లో అరగంట పాటు ఏవీఎం మొరాయించగా, అధికారులు సరి చేశారు. తహసీల్దార్ వీర్‌సింగ్ పోలింగ్‌ను పరిశీలించారు.

రాయపోల్: మండలంలో 19 గ్రామపంచాయతీల పరిధిలో 31 పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం 20వేల 351 ఓటర్లు ఉన్నారు.ఉదయం నుంచి ఆయా గ్రామాల్లో ప్రజలు పోలింగ్ కేంద్రాలకు చెరుకోని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలోని మొత్తం 77.73 శాతం ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.రాయపోల్ పోలింగ్ కేంద్రాన్ని ఎంపీ అభ్యర్ధి కొత్త ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. మండలంలోని అనాజీపూర్‌లో, రాయపోల్ పోలింగ్ కేంద్రాలను తొగుట సీఐ రవీందర్ పర్యవేక్షించారు. మండలంలోని 30 పోలింగ్ కేంద్రాలు ఉండగా 22వేల 997 మంది ఓటర్లు ఉన్నారు. మండలంలోని మహ్మద్‌షాపూర్‌లో ఎంపీపీ అధ్యక్షురాలు అబ్బగౌని మంగమ్మరామస్వామిగౌడ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...