సజావుగా లోక్‌సభ పోలింగ్


Fri,April 12, 2019 12:07 AM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: పార్లమెంట్ ఎన్నికల పో లింగ్ ప్రక్రియ నియోజకవర్గంలో ప్రశాంతంగా జరిగింది. పలుచోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్ల మోరాయింపులు, పో లింగ్ ప్రారంభంలో కొంత ఆలస్యం మినహా మిగతాదంతా ప్రశాంతంగా కొనసాగింది. గురువారం ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ మొదటి రెండు గంటలు కొంత మందకొడిగా ప్రారంభమైనప్పటికీ ఆ తరువాత పుంజుకుంది. పోలింగ్ ముగిసే వరకు నియోజకవర్గంలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, వేలేర్ మండలాల్లో మొత్తం 2,36,756 మంది ఓటర్లు ఉండగా ఇందులో 1,68,307 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 81,976 మంది పురుషులు, 86,330 మంది మహిళా ఓటర్లు ఓటు వేశారు.హుస్నాబాద్ పట్టణంలోని పలు పో లింగ్ కేం ద్రాలతోపాటు కోహెడ, అక్కన్నపేట, బెజ్జంకి మండలాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రా ల్లో ఈవీఎంలు మొరాయించాయి. మధ్యమధ్యలో కూడా వీవీప్యాట్‌లు మొరాయించాయి. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఆయా కేంద్రాల్లో ఏర్పడిన సమస్యను వెంటనే పరిష్కరించడంతో పోలింగ్ సజావుగా కొనసాగింది.

ఆర్డీవో అనంతరెడ్డి ఆధ్వర్యంలో ఆయా మండలాల అధికారుల బృందాలు ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరించారు. కోహెడ మండలం బస్వాపూర్‌లో పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ కృష్ణభాస్కర్ సందర్శించారు. హుస్నాబాద్‌లోని బాలుర జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రాన్ని అసిస్టెంట్ కలెక్టర్ అవిస్యాంత్ పాండే సందర్శించి ఓటర్లతోమాట్లాడారు. కోహెడ మండల కేంద్రంలో పర్యటించిన ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ పోలింగ్ సరళిని కార్యకర్తలు, నాయకులను అడిగి తెలుసుకున్నారు. బెజ్జంకి మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలన సందర్శించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పోలింగ్ జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, ఆర్డీవో కె అనంతరెడ్డి, ఏసీపీ ఎస్ మహేందర్, మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, ఎంపీపీ భూక్య మంగ, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డిలతో పాటు ఆయా మండలాల ఎంపీపీ, జడ్పీటీసీలు, టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏసీపీ మహేందర్, సీఐ శ్రీనివాస్, ఆయా మండలాల ఎస్‌ఐలు భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...