కపూర్‌నాయక్‌తండా, కేశనాయక్‌తండాల్లో ఓటర్ల నిరసన


Fri,April 12, 2019 12:07 AM

అక్కన్నపేట: మండలంలోని కపూర్‌నాయక్‌తండా, కేశనాయక్‌తండా గిరిజనులు గురువారం జరిగిన లోక సభ ఎన్నికల్లో ఓట్లు వేయకుండా ఎన్నికలను బహిష్కరిస్తాన్నమ ంటూ నిరసన వ్యక్తం చేశారు. అయితే విషయం తెలుసుకున్న పోలీస్, రెవెన్యూ అధికారులు ఆయా తండాలకు వెళ్లి గిరిజనులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సృష్టమైన హామీ ఇవ్వడంతో గిరిజనులు పోలింగ్‌లో పాల్గొని ఓట్లు వేశారు. కపూర్‌నాయక్‌తండాలో గిరిజనులు కొన్నేండ్ల నుంచి భూములను దున్నుకుంటున్న రెవెన్యూ అధికారులు పట్టాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. గిరిజనుల ఈ భూ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భూ సమస్యను పరిష్కారించే వరకు ఎన్నికల్లో ఓటు వేయమన్నారు. తహసీల్దార్ నాగజ్యోతి, ఎస్‌ఐ పాపయ్యనాయక్ తండాకు వెళ్లి గిరిజనులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

చివరికి గిరిజనులు ట్రాక్టర్‌లో హుస్నాబాద్ పట్టణంలోని హుస్నాబాద్ ఆర్డీవో అనంతరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఎన్నికల అనంతరం భూ సమస్యను పరిష్కరిస్తామని సృష్టమైన హామీ ఇవ్వడంతో గిరిజనులు వెళ్లి ఓటింగ్‌లో పాల్గొన్నారు. అలాగే కేశనాయక్‌తండాలో పోలింగ్ కేంద్రం గుర్తించిన్నప్పటికి సౌకర్యాలు లేమీ కారణంతో అధికారులు ఇదే గ్రా మ పంచాయతీ పరిధిలోని గొల్లపల్లికి పోలింగ్ మార్చారు. దీంతో కేశనాయక్‌తండా గిరిజనులు పోలింగ్ కేంద్రాన్ని మార్చాడాన్ని నిరసిస్తూ ఓట్లు వేయమన్నారు. ఈవిషయం తెలుసుకున్న ఏఎస్‌ఐ మణెమ్మ వెళ్లి గిరిజనులతో మాట్లాడారు. తిరిగి పోలింగ్ కేంద్రాన్ని ఇక్కడికి మార్చాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఐ పాపయ్యనాయక్, రెవెన్యూ అధికారులు వెళ్లి మాట్లాడి సర్ది చెప్పడంతో ఉదయం 10 గంటల తరువాత పోలింగ్ కేంద్రానికి వెళ్లారు.

మొరాయించిన ఈవీఎంలు..
మండలంలోని జనగామ, అంతకపేట, గౌరవెల్లిలో ఈవీఎంలు మొరాయించాయి. జనగామలో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికల సిబ్బంది తిరిగి ఈవీఎంలు తెప్పించి పోలింగ్ ప్రారంభించారు. అంతకపేట, గౌరవెల్లిలో ఈవీఎంలు మొరాయించారు. ఎన్నికల సిబ్బంది వాటిని సరి చేశారు. పోలింగ్ కేంద్రాలను ఆర్డీవో అనంతరెడ్డి, ఏసీపీ మహేందర్ సందర్శించారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...