లక్ష ఓట్ల మెజార్టీయే లక్ష్యం


Mon,March 25, 2019 12:07 AM

దుబ్బాక టౌన్: నియోజకవర్గంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీయే లక్ష్యంగా టీఆర్‌ఎస్ శ్రేణులు పని చేయాలని ఎమ్మెల్యే సోలిపేట పిలుపునిచ్చారు. ఆదివారం దుబ్బాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యాన్ని ప్రతి టీఆర్‌ఎస్ కార్యకర్త చాలెంజ్‌గా తీసుకొని ముందుకు సాగాలన్నారు. గత ఎన్నికల్లో ఏ విధమైన స్ఫూర్తితో పని చేసి ఫలితాలను సాధించుకున్నామో అదే స్ఫూర్తితో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పని చేసి కొత్త ప్రభాకర్‌రెడ్డికి భారీ మెజార్టీని అందించాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు. ఈ నెల 25 నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతున్నామన్నారు. 25(సోమవారం) రాయపోల్‌లో మధ్యాహ్నం ఎన్నికల ప్రచారం, అదే రోజు సాయంత్రం చేగుంటలో రోడ్‌షో నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 27న దౌల్తాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయంత్రం రోడ్ షో, 31న నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో సాయంత్రం 5 గంటలకు రోడ్‌షో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రామలింగారెడ్డి తెలిపారు. ఇట్టి ఎన్నికల ప్రచారాలను ఆయా మండలాల టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు తౌడ శ్రీనివాస్, కుమార్, నాయకులు రాజమౌలి, ఎల్లారెడ్డి, పర్సకృష్ణ, సుధాకర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, శ్రీనివాస్, మూర్తి శ్రీనివాస్‌రెడ్డి, బండిరాజు తదితరులు ఉన్నారు.

తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం వివక్ష..
తొగుట: జాతీయ పార్టీలకు ప్రజలు చరమగీతం పాడుతున్నారని, ఇక ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలిపారు. ఆదివారం తొగుట మండలం గోవర్ధ్దనగిరిలో మైసమ్మతల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. నాడు ఒక్క ఓటు రెండు రాష్ర్టాలు అంటూ కాకినాడలో తీర్మానం చేసి మోసం చేసిన బీజేపీ పార్టీ నేడు తెలంగాణపై అడుగడుగునా వివక్ష చూపుతుందన్నారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారని, తమకేమి ఈర్ష్యా ద్వేషం లేదని, మన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. జాతీయ హోదా ప్రకటిస్తే 90 శాతం నిధులు కేంద్రం నుంచి వచ్చేవన్నారు. దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు సైతం నిధులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ పలు మార్లు విన్నవించినా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పట్టించుకోలేదన్నారు. తెలంగాణలో 16 సీట్లలో విజయం సాధిస్తే ఢిల్లీ రాజకీయాలను తెలంగాణ నుంచి శాసించ వచ్చన్నారు. ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి దుబ్బాక నియోజకవర్గం నుంచి లక్ష ఓట్ల మెజారిటీ అందించాలన్నారు. ఈనెల 25న రాయపోల్, చేగుంటలలో నిర్వహించ తలపెట్టిన మండల కార్యకర్తల సమావేశం, ఎన్నికల ప్రచారం కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కోరారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...