గణేశుడి దీవెనలతో 5 లక్షల మెజార్టీ సాధిస్తాం


Sat,March 23, 2019 11:27 PM

పటాన్‌చెరు రూరల్, నమస్తే తెలంగాణ: గణేశుడి దీవెనలతో మెదక్ పార్లమెంట్ స్థానాన్ని టీఆర్‌ఎస్ పార్టీ గెలుస్తుంది. 4 నుంచి 5 లక్షల మెజార్టీ రావడం ఖాయం. గజ్వేల్ సీఎం కేసీఆర్ నియోజకవర్గం లక్ష మెజార్టీ వస్తుంది. సిద్దిపేటలో అదే మెజార్టీ రిపీట్ చేయనుండగా, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఎంపీ ఎన్నికల్లో లక్ష మెజార్టీ తెస్తామని హామీనిచ్చిండు. నాయకులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు కృషి చేస్తే అన్నంత మెజార్టీ వస్తుంది. అందరం కష్టపడుదాం ఎంపీగా కొత్త ప్రభాకర్‌రెడ్డిని రికార్డు మెజార్టీతో గెలిపిద్దాం అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గణేశ్ దేవస్థానంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. మెదక్ పార్లమెంట్ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే.సత్యనారాయణలతో కలిసి దేవస్థానం నుంచి ఎన్నికల ప్రచారం మొదలెట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార రథాలను ఎమ్మెల్యే హరీశ్‌రావు జెండా ఊపి ప్రారంభించి, ఎన్నికల ప్రచార పాటల సీడీలను విడుదల చేశారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ జరుగబోయే మెదక్ పార్లమెంట్ ఎంపీ ఎన్నికల్లో కొత్త ప్రభాకర్‌రెడ్డిని 4 నుంచి 5 లక్షల మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణలోనే అత్యధిక మెజార్టీతో కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు.

మెదక్‌లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పటాన్‌చెరు నియోజకవర్గంలో లక్ష మెజార్టీ ఇస్తామని హామీనిచ్చారని గుర్తు చేశారు. కష్టపడి పనిచేసి అందరూ ఆ మెజార్టీని ఇవ్వాలని కోరారు. ఎంపీగా ప్రభాకర్‌రెడ్డి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, ఎంఎంటీఎస్ రైలును ఆర్సీపురం వరకు తీసుకు వచ్చారని, రాబోయే రోజుల్లోనూ పటాన్‌చెరు వరకు మెట్రో రైలును తీసుకుని వస్తారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజుకొకరు జారిపోతున్నారని ఎద్దేవ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదాలను పోరాడి సాధించాలంటే 16 మంది ఎంపీలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు విడమర్చి చెప్పాలన్నారు.

కార్యక్రమంలో ఎంపీపీలు శ్రీశైలంయాదవ్, రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీలు కుంచాల ప్రభాకర్, రాములుగౌడ్, కార్పొరేటర్ తొంట అంజయ్యయాదవ్, టీఆర్‌ఎస్ నాయకులు ఆదర్శ్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ కొలన్‌బాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గాయత్రిపాండు, ఏఎంసీ చైర్మన్ బూరుగడ్డ పుష్ప, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షులు ధశరత్‌రెడ్డి, తుమ్మల పాండురంగారెడ్డి, హన్మంత్‌రెడ్డి, యువత జిల్లా అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, బాసిరెడ్డి నర్సింహారెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ ఆసీఫ్, సర్పంచ్ సుధీర్‌రెడ్డి, ఎంపీటీసీ కొల్లూరు మల్లేశం, చంద్రారెడ్డి, తులసిరెడ్డి, నర్రా భిక్షపతి, దేవానందం, మెట్టుకుమార్‌యాదవ్, వంగరి అశోక్, పట్నంరాజు, వినోద్‌రెడ్డి, గుండెమొల్ల రాజు, నారాయణ్‌రెడ్డి, చందుముదిరాజ్, మెరాజ్‌ఖాన్, షకీల్, రామకృష్ణముదిరాజ్, అజీం, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.

మరోమారు ఆశీర్వదించండి...
- ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను చూసే ఎంపీగా పోటీ చేయమని సీఎం కేసీఆర్ మరోమారు ఆశీర్వదించి అవకాశం ఇచ్చారు. రుద్రారం గణేశ్ దేవస్థానంలో గణపతి స్వామి దీవెనలతో ప్రజల ముందుకు పోతున్న, మీరంతా భారీ మెజార్టీతో గెలిపిస్తారని నమ్మకం ఉంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సహకారంతో మీ అందరి ఆశీస్సులతో విజయం సాధిస్తా. తెలంగాణలోనే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలోనే పటాన్‌చెరు నియోజకవర్గం అతి పెద్దది. ఇక్కడ సమస్యలు కూడా పెద్దగానే ఉన్నాయి. రామచంద్రాపురం వరకు ఎంఎంటీఎస్ రైలును తీసుకుని వచ్చాం. ఇప్పటికే ట్రాయల్ రన్ జరిగింది. సీఎంతో ప్రారంభిద్దామని అనుకుంటే ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల తర్వాత ఎంఎంటీఎస్ రైలును ప్రారంభిస్తాం. మరో సారి ఎంపీగా గెలిపిస్తే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామన్నారు.

లక్ష మెజార్టీ ఇద్దాం...
- ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
సిద్దిపేటలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పటాన్‌చెరు నియోజకవర్గంలో లక్ష మెజార్టీ ఇస్తానని నేను హామీనిచ్చా. ఇచ్చిన మాట ప్రకారం లక్ష మెజార్టీ చూపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కష్టపడి మన అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని ఎంపీగా గెలిపించుకుందాం. అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన విధంగానే కార్యకర్తలందరూ గట్టిగా పనిచేయాలని మీ అందరినీ కోరుతున్నా. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా మారి ఓటింగ్ శాతం పెంచాలి. ఎంపీగా కొత్త ప్రభాకర్‌రెడ్డి మన ప్రాంతభివృద్ధికి అండగా నిలిచిండు. పంచాయతీ ఎన్నికల్లో 55కి 50 సర్పంచ్ స్థానాలు గెలిచాం. సిద్ధి వినాయకుడి వద్ద పూజలు చేసి ప్రచారం ప్రారంభిస్తే గెలుపుఖాయమని నా సెంటిమెంట్. ఎంపీగానూ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభించారు. వినాయకుడి దీవెనలతో ఆయన భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని నా నమ్మకం.

కాళేశ్వరానికి జాతీయ హోదా వస్తుంది
- మాజీ ఎమ్మెల్యే కే.సత్యనారాయణ
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రావాటంటే టీఆర్‌ఎస్ పార్టీకి 16 ఎంపీ సీట్లు రావాలి. కొత్త ప్రభాకర్‌రెడ్డి రికార్డు మెజార్టీతో రెండోమారు ఎంపీగా గెలుస్తారు. మృధుస్వభావి, అభివృద్ధిపై వీజన్ ఉన్న నాయకుడు ప్రభాకర్‌రెడ్డి ఆయన గెలుపుతో ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రతి కార్యకర్త ఓటర్లందరినీ కలువాలి. ఎంపీగా కొత్త ప్రభాకర్‌రెడ్డికి మంచి మెజార్టీని ఇద్దాం.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...