బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలు ప్రారంభం


Sat,March 23, 2019 11:26 PM

సంగారెడ్డి టౌన్ : ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలను ప్రారంభించి నట్లు మెదక్ టెలికాం బీఎస్‌ఎన్‌ఎల్ ప్రధాన జనరల్ మేనేజర్ పి.సీతారామరాజు తెలిపారు. శనివారం పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి 4జీ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యధిక స్పీడ్‌తో 4జీ సేవలను భారతదేశంలో ప్రారంభించినట్లు చెప్పారు. తెలంగాణలో మొదటి దశలో 409 ప్రాంతాల్లో జిల్లా హెడ్‌క్వార్టర్స్, ప్రముఖ ప్రదేశాల్లో ప్రారంభించామన్నారు. మెదక్ టెలికాం పరిధిలో 29 ప్రాంతాల్లో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో మొదటి విడుతలో 4జీ సేవలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ (హై స్పీడ్ ప్యాకేజీ యాక్సెస్) టెక్నాలజీతో 3జీ సేవలను అందిస్తుందన్నారు. 21.5 ఎంబీపీఎస్ గరిష్ట డౌన్‌లోడ్ 11.2 ఎంబీపీఎస్ అప్లోడ్ స్పీడ్లను పొందుతుందన్నారు.

ఉమ్మడి జిల్లా పరిధిలో 186 ప్రాంతాల్లో 3జీ సేవలు అందుతున్నాయన్నారు. ప్రస్తుతం మొదటి విడుతలో 72 ప్రాం తాల్లో 4జీ సేవలను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. 4జీ టెక్నాలజీతో 4జీ స్పెక్ట్రమ్ లభ్యత ఆధారంగా 25ఎంబీపీఎస్ నుంచి 100 ఎంబీపీఎస్ వరకు వేగం మారుతూ ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం 29 జీసీఎస్ వేగంతో 4జీ సేవలు అందిస్తుందని, పాత కస్టమర్లు తమ వద్ద ఉన్న 2జీ, 3జీ సిమ్‌లను 4జీ సిమ్‌లుగా మార్చుకుని సేవలు పొందాలన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ సెంటర్లు, ఔట్‌లెట్లలో ఉచితంగా 4జీ సిమ్‌లను మార్చుకుని అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఉమ్మడి మెదక్ పరిధిలో 11వేల మంది కస్టమర్లు ఉన్నారని, వారిలో 6వేల మంది 4జీ సిమ్‌లను వాడుతున్నారన్నారు. మిగతా కస్టమర్లు కూడా 4జీ సిమ్‌లను తీసుకుని అత్యధిక హైస్పీడ్ డాటాను వాడుకోవాలని సూచించారు. ఏప్రిల్ నెల ఆఖరు వరకు ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న 186 ప్రాంతాల్లో 4జీ అందుబాటులోకి వస్తాయన్నారు. విలేకరుల సమావేశంలో టెలికాం డీజీఎం దత్తాత్రేయ, ఎఫ్‌ఎస్‌ఏ రాంబాబు, రాఘవరావ్, ఏజీఎం సునీత తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...