వెంకన్న ఆశీస్సులతో విజయం సాధిస్తాం


Sat,March 23, 2019 12:29 AM

- టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ ఖాయం
- మెదక్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి
- ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, రామలింగారెడ్డితో కలిసి పూజలు

దుబ్బాక, నమస్తే తెలంగాణ/నంగునూరు : సీ ఎం కేసీఆర్ సెంటిమెంట్ ఆలయం.. ఇష్ట దైవమై న కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మెదక్ పార్లమెంట్ స్థానాన్ని భారీ మెజార్టీతో కై వసం చేసుకుంటామని టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, రా మలింగారెడ్డితో కలిసి నామినేషన్ పత్రాలు వెంకటేశ్వరస్వామి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేసి, స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. నామినేషన్ పత్రాలు తీసుకొని మెదక్‌లో నామినేషన్ దా ఖలు చేశారు. ఉదయం 6గంటలకు ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామమైన దుబ్బాక మండలం పోతారం హ నుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే సోలిపేటతో కలి సి ఆలయంలో పూజలు చేశారు. ఎంపీ కొత్త ప్ర భాకర్‌రెడ్డి శుభకార్యక్రమాలు ప్రారంభించేముం దు తమ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేయడం సెంటిమెంట్. గత ఎన్నికల్లో నూ ఈ ఆలయంలో పూజలు చేయగా, భారీ మె జార్టీతో విజయం సాధించారు.

ఈ కార్యక్రమం లో ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, నంగునూరు ఏఎంసీ చైర్మన్ ఎడ్ల సోంరెడ్డి, సిద్దిపేట ఏఎంసీ మాజీ చైర్మన్ వే ముల వెంకట్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మం డల అధ్యక్షుడు బద్దిపడగ కిష్టారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కోల రమేశ్, పార్టీ మండలాధ్యక్షుడు లింగంగౌడ్, సీనియర్ నాయకులు బక్కి వెంకటయ్య, తడిసిన వెంకట్‌రెడ్డి, కోమాండ్ల రామచంద్రారెడ్డి, దువ్వల మల్లయ్య, నిమ్మ మల్లారెడ్డి, కోనాయిపల్లి సర్పం చు వెంకటేశం, నాయకులు తదితరులున్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...