దుబ్బాకలో సజావుగా ఎమ్మెల్సీ ఎన్నికలు


Sat,March 23, 2019 12:29 AM

- నియోజకవర్గంలో 63 శాతం పట్టభద్రులు, 86.4 శాతం ఉపాధ్యాయుల పోలింగ్
- ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి

దుబ్బాక,నమస్తే తెలంగాణ : దుబ్బాక నియోజకవర్గంలో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. నియోజకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం పట్టభద్రులు 2,892 మందికి గాను 1824 మంది (63 శాతం) ఓటుహక్కు వినియోగించుకున్నారు. 228 మంది ఉపాధ్యాయులకు గాను 197 మంది ఉపాధ్యాయులు(86.4 శాతం) ఓటు వేశారు. అత్యధికంగా రాయపోల్ మండలంలో 78 శాతం పట్టభద్రులు, వంద శాతం ఉపాధ్యాయులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో (పోలింగ్ కేంద్రంలో) మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు పలు గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు పట్టభద్రుల ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టభద్రులతో పాటు ఉపాధ్యాయులు తమ ఓటును వినియోగించుకున్నారు.

దుబ్బాక పొలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ కృష్ణభాస్కర్ సందర్శించి, ఎన్నికల సరళిని పరిశీలించారు. దుబ్బాక మండలంలో 1508 పట్టభద్రులకు గాను 924 (61.3శాతం)మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 124 మంది ఉపాధ్యాయులకు గాను 113 మంది (91.2శాతం) ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిరుదొడ్డి మండలంలో 611 మంది పట్టభద్రులకు గాను 372 మంది( 60.68 శాతం) , 50 మంది ఉపాధ్యాయులకు గాను 41 మంది (80 శాతం) ఓటుహక్కు వినియోగించుకున్నారు. తొగుట మండలంలో 321 మంది పట్టభద్రులకు గాను 205 మంది(63 శాతం), 24 మంది ఉపాధ్యాయులకు గాను 21 మంది (87 శాతం) ఓటు వేశారు. దౌల్తాబాద్ మండలంలో 250 మంది పట్టభద్రులకు గాను 116 మంది (66.2 శాతం), 26 మంది ఉపాధ్యాయులకు గాను 18 మంది (69 శాతం) ఓటు వేశారు. రాయపోల్ మండలంలో 202 మంది పట్టభద్రులకు గాను 157 మంది (78శాతం), నలుగురు ఉపాధ్యాయులకు గాను నలుగురు ఉపాధ్యాయులు(వంద శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...