ప్రశాంతంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు


Sat,March 23, 2019 12:24 AM

చేర్యాల, నమస్తే తెలంగాణ: నల్ల గొండ, వరంగల్, ఖమ్మం పూర్వపు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు శుక్రవారం చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండలాల్లోప్రశాంతంగా జరిగింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఎన్నికలు నిర్వహించడంతో ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నా రు. చేర్యాల పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం, మద్దూరు ఉన్నత పాఠశాల, కొమురవెల్లి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేం ద్రంలో చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాలకు చెందిన ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చేర్యాల మండలంలో 104 ఓట్లకు గాను ఉపాధ్యాయులు 94, మద్దూరులో 48 ఓట్లకు 40, కొమురవెల్లి మండలంలో 9 ఓట్లకు గాను 8 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మద్దూరులో పోలింగ్ కేంద్రాన్ని సీసీఎస్ ఏసీపీ హబీబ్‌ఖాన్ సందర్శించారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...