తల్లిదండ్రుల చెంతకు చిన్నారులు


Sat,March 23, 2019 12:23 AM

మద్దూరు: మండలంలోని బెక్కల్‌లో శివాలితండాలో కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థులను శుక్రవారం పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ పాడి రాజిరెడ్డి మాట్లాడుతూ బెక్కల్ శివాలితండాకు చెందిన లకావత్ యాదగిరి కుమారుడు లకావత్ దీపక్, లకావత్ రాజు కుమారుడు లకావత్ కల్యాణ్‌లు ఈ నెల 17న ఇంటి నుంచి తల్లిదండ్రులకు చెప్పకుండా బయటకు వెళ్లినట్లు తెలిపారు. దీంతో వారి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసును నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. పోలీసులు విద్యార్థుల కోసం గాలించడంతో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఆచూకీ లభ్యం కావడంతో వారిని తల్లిదండ్రులకు అప్పజెప్పినట్లు వివరించారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...