స్మార్ట్ ఇండియా హ్యాక్‌థాన్ సాధించిన ఐఐటీ హైదరాబాద్


Fri,March 22, 2019 12:39 AM

సంగారెడ్డి చౌరస్తా : ఐఐటీ హైదరాబాద్ బృందం-2019 స్మార్ట్ ఇండియా హ్యాక్‌థాన్ సాధించింది. దేశంలో సాంకేతిక పరమైన సమస్యల పరిష్కారం కోసం స్మార్ట్ ఇండియా హ్యాక్‌థాన్ పనిచేస్తూ ఉంటుంది. కంది ఐఐటీ హైదరాబాద్ కు చెందిన ఆరుగురు సభ్యులు గల బృందం స్టీల్ కన్‌స్ట్రక్షన్ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనుడంలో భాగంగా ఈ అరుదైన అవకాశం దక్కించుకోవడం వి శేషం. సమస్య పరిష్కారానికి మార్గం క నుగొన్న బృందం రూ.75 వేల నగదు ప్రోత్సాహకం కూడా గెలుచుకున్నది. స్టీ ల్ కన్‌స్ట్రక్షన్ సమస్యను పరిష్కరించడం లో భాగంగా నిరంతరాయంగా 36 గం టలపాటు సాఫ్ట్‌వేర్‌ను కోడింగ్ చేస్తూ మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేశారు. దీంతో ఐఐటీ హైదరాబాద్ స్నాప్ బృందాన్ని సమస్య పరిష్కారం కోసం ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ ఎంపిక చేసింది. ఈ సందర్భంగా స్నాప్ బృందం శిక్షకుడు డాక్టర్ అభినవ్‌కుమా ర్ బృంద సభ్యులను అభినందించారు. సైట్ కన్స్‌స్ట్రక్షన్ ప్రోగ్రెస్ అప్డేట్ సమస్యకు వినూత్న పరిష్కారం చూపారని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ బృందంలో స్నాప్ టీమ్ లీడర్‌గా ఎంటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (కమ్యూనికేషన్స్ అండ్ సిగ్నల్ ప్రా సెసింగ్) ద్వితీయ సంవత్సరం విద్యార్థి సిద్ధార్థ్ గుప్తా, అదే బ్యాచ్‌కు చెందిన ప్రభాత్‌కుమార్, ఎంటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (కమ్యూనికేషన్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్) ప్రథమ సంవత్సరం విద్యార్థిని నిషా అకోలే, అదే బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు అజయ్ హేస్, ప్రసాద్ గైక్వాడ్, అమన్ అగర్వాల్‌లు ఉన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...