అకాల వర్షం..అపార నష్టం


Fri,March 22, 2019 12:38 AM

దుబ్బాక,నమస్తే తెలంగాణ : దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురు గా లులతో కూడిన వర్షం కురిసింది. పలు చోట్ల పిడుగుపాటుతో పశువులు మృతి చెందాయి. మరికొన్ని చోట్ల ఈదురు గాలులకు పైకప్పులు లేచిపోయి నష్టం వా టిల్లింది. పలు గ్రామాల్లో మామిడిపంటతో పాటు వరి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. గురువారం సాయంత్రం అరగంటసేపు కురిసిన రాళ్ల వాన రైతన్నలకు కన్నీళ్లు మిగిల్చింది. దుబ్బాక మండలంలో హబ్షీపూర్, చిట్టాపూర్, అప్పనపల్లి, తిమ్మాపూ ర్, పద్మనాభంపల్లి తదితర గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. తిమ్మాపూర్, అప్పనపల్లి గ్రామాల్లో పిడుగులు పడడంతో పశువులు మృతి చెందాయి. అప్పనపల్లిలో కొండి సత్తిరెడ్డి పొలంలో పిడుగుపాటుతో అక్కడున్న మూడు బర్రెలలో ఒక బ ర్రె అక్కడికక్కడే మృతి చెందగా..మరో రెండు బర్లకు గాయాలయ్యాయి. సూమారు రూ. 60 వేల నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తిమ్మాపూర్‌లో పిడుగుపాటుకు బండారి సిద్ధి రాములుకు చెందిన రూ.50 వేల విలువైన రెండు దుడ్డెలు మృతి చెందాయి. అప్పనపల్లిలో కూరగాయలు, మా మిడి పంటలకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు పద్మనాభంపల్లి ప్రభుత్వ పాఠశాలలోని వంటగది పై కప్పు రేకులు లేచిపోయాయి. అదేగ్రామంలో గండెళ్లి మల్లేశంకు చెందిన ఇంటిపైకప్పు రేకులు ధ్వంసమయ్యాయి. గ్రామంలో మొక్కజొన్న, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన కత్తి రమేశ్ హోటల్ పైకప్పు రేకులు లేచిపోవంటతో నష్టం వాటిల్లింది. ఈ వర్షానికి గ్రామాల్లో మామిడి కాయలు నేల రాలిపోయాయి. అప్పనపల్లిలో ఈదురు గాలులతోకూడిన రాళ్ల వాన కురిసింది. టమాటా, మామిడి, కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు ఆ గ్రామ సర్పంచ్ లక్ష్మి తెలిపారు. తిమ్మాపూర్‌లో పిడుగుపాటుకు రెండు బర్లు మృతి చెందటంతో పాటు మామిడి కాత భారీగా నష్ట పోయిందని సర్పంచ్ మంజుల, పీఏసీఎస్ డైరేక్టర్ రవిందర్‌రెడ్డి తెలిపారు. దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లో పలు గ్రామాల్లో మామిడి, కూరగాయల పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...