సోలార్ వినియోగంలో ఎర్రవల్లి ఆదర్శం


Wed,March 20, 2019 11:53 PM

మర్కూక్: సోలార్ విద్యుత్ వాడకంలో ఎర్రవల్లి గ్రామం ఆదర్శమని భెల్ డైరెక్టర్ రంజిత్‌రే అన్నారు. బుధవారం మండలంలోని సీఎం దత్త త గ్రామం ఎర్రవల్లిని సందర్శించారు. రెం డేండ్ల క్రితం ఎర్రవల్లి గ్రామంలో సీఎస్‌ఆర్ కింద రూ.2 కోట్ల 90లక్షలతో ఇంటింటికీ సోలార్ సిస్టంను అందించారు. గ్రామంలో పర్యటిస్తూ సోలార్ సిస్టం విధానాన్ని పరిశీలించారు. అలాగే డబుల్ బెడ్‌రూం ఇండ్లు బాగున్నాయని కితాబి చ్చారు. రాష్ట్రంలోని పవర్ ప్లాంట్లకు కూడా సీఎస్‌ఆర్ నిధులను అందించామని చెప్పారు. దేశంలో థర్మల్, బాయిలర్, గ్యాస్, హైడ్రో సోలార్ ప్లాంట్ల కోసం నిధులు ఇచ్చామని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే పనులకు కంపెనీ పెద్దపీట వేస్తుందన్నారు. అందులో భాగంగానే సీఎం దత్తత గ్రామం ఎర్రవల్లిలో రూ.2కోట్ల 90 లక్షలతో సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. నేషనల్ ప్రాజెక్టు ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు కూడా సహకరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే 15ముఖ్యమైన కంపెనీలు ఉన్నాయని, ముఖ్యంగా విద్యుత్‌కు సంబంధించిన సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పర్యావరణానికి హాని కలుగ కుండా పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పనులు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఎర్రవల్లిలో సోలార్ వాడ కం బాగుందని, దీంతో విద్యుత్ ఆదా అవుతుందని, వినియోగదారులకు విద్యుత్ బిల్లులు తప్పాయన్నారు. దేశస్థాయిలో ఎర్రవల్లి మరిన్ని అవార్డులను అందుకొని నూతన గ్రామాలకు ఆదర్శంగా నిలువాలన్నారు. ఇటీవల జాతీయ స్వచ్ఛ్ శక్తి అవార్డు అందుకోవడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సోలార్ వాడకంలో కూడా ఆదర్శంగా నిలువాలని ఆయన సూచించారు.

సీఎస్‌ఆర్ నిధులతో సేవా కార్యక్రమాలు
భెల్ సంస్థ ద్వారా సీఎస్‌ఆర్ నిధులతో ఏటా పలు రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని బెల్ డైరెక్టర్ రంజిత్‌రే పేర్కొన్నారు. దేశంలోనే భెల్ కంపెనీ మంచిపేరు ఉందని, కోట్ల నిధులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. పాఠశాల భవనాలు, ఫర్నీచర్, విద్యా వైద్య అభివృద్ధి తదితర అవసరాలు సమకూర్చేందుకు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. పెద్దాపూర్, చౌదర్‌పల్లి గ్రామాల్లో పాఠశాల భవనాలు నిర్మించామని, మరిన్ని సామాజిక కార్యక్రమాలు సంస్థ ద్వారా చేపట్టామని ఆయన తెలిపారు. గ్రామానికి మొదటిసారి వచ్చిన భెల్ డైరెక్టర్ రంజిత్‌రేను గ్రామ సర్పంచ్ భాగ్యభిక్షపతి పుష్పగుచ్ఛం అం దించి స్వాగతం పలికారు. అధికారులకు వార్డు సభ్యులు శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో భెల్ జనరల్ మేనేజర్ పండరీనాధ్, రాకేశ్‌షోకాని, ఉదయ్‌కుమార్, డీవో రామేశ్వర్‌రావు, వీడీసీ గౌరవాధ్యక్షుడు బాల్‌రాజు, ఎంపీటీసీ భాగ్యమ్మ, వార్డుసభ్యులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...