పనుల్లో వేగం పెంచాలి


Wed,March 20, 2019 11:53 PM

గజ్వేల్ నమస్తే తెలంగాణ/ములుగు: మల్లన్న, కొండపోచమ్మ రిజర్వాయర్ భూ నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న ఆర్‌అండ్‌ఆర్ కాలనీ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఇంజినీరింగ్, ఏజెన్సీ ప్రతినిధులను కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదేశించారు. గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ముట్రాజ్‌పల్లి, ములుగు మండలంలోని తునికిబొల్లారం సమీపంలో నిర్మిస్తున్న ఆర్‌అండ్‌ఆర్ కాలనీ నిర్మాణ పనులను బుధవారం గజ్వేల్ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, పీఆర్‌శాఖ ఇంజినీర్లతో కలిసి క్షేత్రస్ధాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. ముంపునకు గురయ్యే భూ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకునేందకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ మేరకు ముట్రాజ్‌పల్లి, తునికిబొల్లారం గ్రామాల శివారులో నిర్మిస్తున్న ఆర్‌అండ్‌ఆర్ కాలనీ నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీస్తూ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష జరిపారు. కార్యక్రమంలో గజ్వేల్, ములుగు మండలాల తహసీల్దార్లు శ్రీనివాస్, విజయ్‌కుమార్‌లతో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...