స్వచ్ఛమైన నీటితోనే ఆరోగ్యం క్షేమం


Wed,March 20, 2019 11:53 PM

మిరుదొడ్డి: ప్రజలందరూ పరిశుభ్రమైన నీటిని తాగడం మూలంగా ఎలాంటి వ్యాధులు దరి చేరకుండా ఆరోగ్యంగా ఉంటారని అల్వాల సర్పంచ్ ఎనగంటి కిష్టయ్య అన్నారు. బుధవారం అల్వాల గ్రామంలో బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో బాల వికాస్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రజల సహకారంతో స్థలంతో పాటు రూ.70 వేలు బాలవికాస సంస్థ డిపాజిట్ చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ...ఆరోగ్య వంతమైన గ్రామంగా అల్వాల నెలకొనడానికి వాటర్ ప్లాంట్ ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బాల వికాస సంస్థ కోఆర్డినేటర్లు నరేశ్, రాజశేఖర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...